జాతీయ వార్తలు

జమ్మూ విమానాశ్రయంలో ఆజాద్‌కు మళ్లీ ‘షాక్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ / న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో ఆజాద్‌కు ఆంక్షల దెబ్బ రెండోసారి తగిలింది. మంగళవారం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి జమ్మూ విమానాశ్రయానికి వచ్చిన ఆజాద్‌ను బలవంతంగా సాయంత్రం 4.10 గంటలకు వెనక్కి పంపారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడైన ఆజాద్‌ను ఆయన సొంత రాష్ట్రంలోకి అనుమతించకపోవడం శోచనీయమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవీందర్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల ఎనిమిదో తేదీన ఆజాద్ శ్రీనగర్ వచ్చినప్పుడు విమానాశ్రయంలో కొద్దిసేపు ఆయన్ను అదుపులోకి తీసుకొని అనంతరం ఢిల్లీకి పంపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై పార్టీ నేతలతో మాట్లాడేందుకు వచ్చిన రాజ్యసభలో ప్రతిపక్ష నేతను వెనక్కి తిరిగి పంపడం సరైన చర్య కాదని శర్మ పేర్కొన్నారు. కాంగ్రెస్ కానీ, ఆ పార్టీ నాయకులు కానీ ట్రబుల్ మేకర్లు కాదన్న సంగతి కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు.