జాతీయ వార్తలు

ఇది అధికార దుర్వినియోగం చిదంబరాన్ని వెంటాడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరాన్ని వేధించేందుకు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అనేకమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ కేసులో చిదంబరానికి సంఘీభావం ప్రకటించారు. చిదంబరం వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చడానికి దర్యాప్తు ఏజన్సీలు, మీడియాను కూడా ప్రభుత్వం వాడుకుంటోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈ కేసులో పర్యవసానాలు ఎలా వున్నా న్యాయం కోసం పోరాడుతామని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక వాద్రా అన్నారు. ఆర్థికమంత్రిగాను ఇతర హోదాల్లో దేశానికి ఎంతో సేవ చేసిన చిదంబరాన్ని ప్రభుత్వం వెంటాడుతోందని ఆమె అన్నారు. మొదటినుంచి కూడా చిదంబరం ప్రస్తుత ప్రభుత్వ తీరుపట్ల విమర్శలు చేస్తున్నారని, దాని వైఫల్యాలను ఎండగడుతున్నారని ప్రియాంక తెలిపారు. ఇవేవీ నచ్చని ప్రభుత్వం ఆయనపై కక్షగట్టిందని ఆమే విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తామంతా చిదంబరానికి అండగా నిలుస్తామని ఆమె స్పష్టం చేశారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా అధికారికంగా పూర్తి వత్తాసు పలికింది. నిజాన్ని నిర్భయంగా మాట్లాడేవారిని ప్రభుత్వం వేధిస్తోందని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఈ చర్య ద్వారా తన పిరికితన స్వభావాన్ని చాటుకుంటోందని ఆరోపించింది. బీజేపీ సారథ్యంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని, మోదీ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు ఒడిగడుతోందని సుర్జేవాలా అన్నారు. కాంగ్రెస్ ప్రతినిధి సుర్జేవాలా, ఆనందశర్మ కూడా చిదంబరానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టు నుంచి ఎలాంటి రక్షణ ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ కేసు వ్యవహారం రాజకీయ రంగు సంతరించుకుంది. మోదీ ప్రభుత్వం, ఎన్‌ఫోర్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐలను దుర్వినియోగం చేస్తోందని, అలాగే చిదంబరం వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చడానికి వెనె్నముక లేని కొన్ని మీడియా సంస్థలను కూడా వాడుకుంటోందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అత్యంత హేయమైన రీతిలో సాగుతున్న ఈ అధికార దుర్వినియోగాన్ని తాను గర్హిస్తున్నానని రాహుల్ అన్నారు.