జాతీయ వార్తలు

ఆర్థిక విధానాలు లోపభూయిష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఆర్థికపరమైన ప్రకటనలన్నీ ప్రజలను మరోసారి ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నమే తప్ప వాస్తవానికి ప్రాథమిక విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల ధరలు తగ్గాయని, విదేశీ, స్వదేశీ ఈక్విటీ పెట్టుబడులు అధిక మొత్తంలో వస్తున్నాయని చెప్పడాన్ని శనివారం ట్విట్టర్‌లో తోసిపుచ్చారు. గత ఐదేళ్ళలో ఆర్థిక ప్రగతి కుంటుపడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం చేసిన ప్రకటలన్నీ కేవలం ప్రజలను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నమే తప్ప మరేమీ కాదని అన్నారు. ప్రాథమిక విధానాలు లోపభూయిష్టంగా ఉంటే దేశాన్ని ప్రగతి పథంలో ఎలా నడిపిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాల వల్ల అన్ని రంగాలూ దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు. ధనవంతులకే సర్ ఛార్జీ ఉపసంహరించారని ఆయన విమర్శించారు. రైతులకు ప్రయోజనాలు కలిగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. రైతులకు రాయితీలు ఇవ్వలేదని, ఆర్థికంగా కుంటుపడి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారని ఆయన తెలిపారు. మరోవైపు నిరుద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహతో ఉన్నారని ఏచూరి పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రకటించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఎన్నింటిని అమలు చేశారని, వాటికి పవిత్రత ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఉండాలని ఏచూరి తెలిపారు.