జాతీయ వార్తలు

త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: త్రివిధ దళాధిపతులు శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్, వైమానిక దళ ప్రధానాదికారి అరుప్ రాహా, నౌకాదళ ఉప ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ కెపి సింగ్‌లు 7, లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా నగరంలో లేక పోవడంతో ఆయన ఈ సమావేశానికి రాలేదు. జమ్మూ, కాశ్మీర్‌లోని ఉరీలో సైనిక స్థావరంపై ఇటీవలి ఉగ్రవాద దాడుల నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులు ప్రధానిని కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే రక్షణ శాఖ వర్గాలు మాత్రం ఇది రొటీన్ సమావేశమేనని అంటున్నాయి. వివిధ అంశాలను చర్చించడం కోసం సాయుధ దళాల అధిపతులు ప్రతినెలా ప్రధానితో సమావేశం కావడం మామూలేనని ఆ వర్గాలు అంటున్నాయి. అయితే ఉరీ ఉగ్ర దాడి అనంతరం ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ ప్రధానిని, పిఎంఓ అధికారులను అనేకసార్లు కలిశారు. ఉరీ ఉగ్రవాద దాడి అనంతరం సరిహద్దుల్లో భద్రత గురించి, ఉరీ దాడిపై భారత్ ప్రతిస్పందన గురించి ప్రధాని వారితో చర్చించినట్లు తెలుస్తోంది.