జాతీయ వార్తలు

బీజేపీలోకి హర్షవర్దన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 11: కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి హర్షవర్దన్ పాటిల్ బుధవారం బీజేపీలో చేరారు. దక్షిణ ముంబైలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో 56 ఏళ్ల పాటిల్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ పాటిల్ వంటి సమర్థుల రాక కోసం సుమారు ఐదేళ్లుగా తాము ఎదురుచూస్తున్నామన్నారు. ఇందాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పాటిల్‌ను నిలబెట్టే అవకాశం ఉన్నట్టు ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. ఇదే నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాటిల్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, ఎన్సీపీ అభ్యర్థి దత్తాత్రేయ భార్నే చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ వేర్వేరుగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే బారామతి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసినపుడు ఆమెకు పాటిల్ మద్దతునిచ్చారు.