జాతీయ వార్తలు

ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ హనీ నివాసంలో పోలీసుల సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: నోయిడాలో నివాసిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబు నివాసంలో పోలీసులు సోదా చేశారు. పోలీసులు సోదా చేయడంపై జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (జెఎన్‌యుటీఏ) నేతలు బుధవారం తీవ్రంగా ఖండించారు. పుణే పోలీసులు మంగళవారం హనీ బాబు నివాసంలో సోదాలు నిర్వహించారు. 2017లో ఎల్గార్ పరిషద్ కేసు, మావోలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు, అనుమానంతో సోదా చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రొఫెసర్ హనీ బాబును పోలీసులు కక్ష సాధింపు చర్యగా ఈ రకంగా వేధిస్తున్నారని జెఎన్‌యుటీఏ నాయకులు విమర్శించారు. సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు సోదాలు నిర్వహించి హనీ బాబు కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారని వారు ఆరోపించారు. సోదా నిర్వహించామే తప్ప ఎవరినీ అరెస్టు చేయలేదని పుణే అసిస్టెంట్ పోలీసు కమిషనర్ శివాజీ పవార్ మీడియాకు తెలిపారు. ఇలాఉండగా సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు తమ నివాసంలో సోదాలు నిర్వహించారని ప్రొఫెసర్ హనీ బాబు తెలిపారు. పైగా తన ఫోన్‌ను, భార్య, కుమార్తె ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన చెప్పారు. పుణే పోలీసులు తన ల్యాప్ ట్యాప్‌ను, ఎక్స్‌టర్నల్ హార్డ్ డ్రైవ్స్‌ను, పెన్ డ్రైవ్స్‌ను తీసుకెళ్ళారని ఆయన తెలిపారు.