జాతీయ వార్తలు

పంట దిగుబడులు పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: దేశంలో రోజురోజుకు సాగుభూమి, జల వనరులు తగ్గిపోతుండటం వల్ల పంటల దిగుబడులను పెంచడానికి శాస్ర్తియమైన పరిష్కారాన్ని కనుగొనాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శాస్తవ్రేత్తలకు పిలుపునిచ్చారు. సాంకేతిక పరిజ్ఞాన ప్రయోజనాలు సామాన్య మానవుడికి చేరేలా సరయిన భాగస్వాములను ఒక్కచోటికి తీసుకురావలసిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్‌ఐఆర్) ప్లాటినం జూబిలీ ఉత్సవాలలో మోదీ మాట్లాడుతూ ‘ప్రతి నీటిబొట్టుతో మరింత ఎక్కువ పంట పండించాలని నేను ఎప్పుడూ చెబుతుంటాను. ఓ అంగుళం భూమిలో పెద్దమొత్తంలో పంట పండించడం గురించి కూడా మనం ఆలోచించి తీరాలి’ అని అన్నారు. దేశ ప్రజల అవసరాలను తీర్చే పరిమాణంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో కూరగాయల దిగుబడిని పెంచేందుకు కృషి చేయాలని కూడా ఆయన శాస్తవ్రేత్తలను కోరారు. వినియోగదారుల అవసరాలను నిర్దిష్ట కాలపరిమితిలోగా తీర్చాలనే లక్ష్య సాధనపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘మనం ఇప్పుడు 75వ సంవత్సరంలో ఉన్నాం. నిర్దిష్ట కాలపరిమితిలోగా సేవలందించడం అనే ఏకైక అజెండాను ముందుకు తీసుకెళ్లాలి’ అని సిఎస్‌ఐఆర్ అధ్యక్షుడు కూడా అయిన మోదీ సూచించారు. ప్రత్యేకించి ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, జల వనరులు, వ్యర్థాల నిర్వహణ, గంగానది శుద్ధి వంటి రంగాలలో సృజనాత్మక పరిశోధనకు పూనుకోవాలని ఆయన శాస్తవ్రేత్తలకు పిలుపునిచ్చారు. ‘టెక్నాలజి బిజినెస్’ చేయడానికి వీలు కల్పించాల్సిన అవసరం ఉందని, సాంకేతిక పరిజ్ఞానం సామాన్య ప్రజలకు అందేలా సిఎస్‌ఐఆర్ సరయిన భాగస్వాములను ఒక్కచోటికి తీసుకురావాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘ఏదేని సాంకేతిక పరిజ్ఞానం ప్రయోజనం సామాన్య మానవుడికి చేరిప్పుడే ఆ సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం అయినట్టు పరిగణించడం జరుగుతుంది. అప్పుడప్పుడు మనం ఏదో ఒకదాన్ని కనుక్కుంటాం. కాని దాని గురించి సామాన్య మానవుడికి తెలియదు. సామాన్య మానవుడి అవసరాలను తీర్చేవిధంగా మనం దానిని ఆధునీకరించగలమా?’ అని ప్రధాని శాస్తవ్రేత్తలను అడిగారు. క్రీడాపరిశోధన, దీర్ఘకాలం పనిచేసే మొబైల్ బ్యాటరీల తయారీ వంటి కొత్త రంగాలను అనే్వషించాలని ఆయన సిఎస్‌ఐఆర్‌ను కోరారు. పరిశోధన సంస్థ, పరిశ్రమ, స్వచ్ఛంద సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్లు, వినియోగదారుల మధ్య ఒక వాల్యూ చైన్‌ను సృష్టించవలసిన అవసరం ఉందని ప్రధాని నొక్కి చెప్పారు. ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి, అందులో అన్ని రీసెర్చ్ గ్రాంట్ల వివరాలు, వివిధ ప్రయోగశాలల్లో శాస్తవ్రేత్తలు నిర్వహిస్తున్న ప్రయోగాల వివరాలను పొందుపరచాలని ఆయన కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖకు సూచించారు. దీనివల్ల ఒకచోట చేస్తున్న ప్రయోగానే్న మరోచోట చేయకుండా నివారించగలమని, తద్వారా సమయాన్ని, నిధులను పొదుపు చేసుకోవచ్చని వివరించారు.
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకోసం పంటల కొత్త రకాలను అభివృద్ధి చేయాలని ప్రధాని శాస్తవ్రేత్తలను కోరారు. ‘మీరు పప్పుదినుసుల కొత్త రకాన్ని అభివృద్ధి చేయగలిగితే, దానివల్ల వర్షాధార ప్రాంతాలలో దిగుబడులను బాగా పెంచవచ్చు. మానవ శరీరంలో మాంసకృత్తుల లోపాన్ని పూడ్చడానికి కూడా ఇది దోహదపడుతుంది’ అని ఆయన శాస్తవ్రేత్తలకు వివరించారు.

చిత్రం.. సిఎస్‌ఐఆర్ ప్లాటినం జూబిలీ ఉత్సవాల్లో భాగం పంచుకున్న విద్యార్థులను అభినందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ