జాతీయ వార్తలు

సైబర్ భద్రతకు ప్రత్యేక చట్టం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణె, సెప్టెంబర్ 19: దేశ వ్యాప్తంగా సైబర్ నేరాల అణచివేతకు ప్రత్యేక చట్టం తీసుకురావడంతోపాటు బడ్జెట్ కేటాయింపులు కూడా అవసరమని నూతనంగా ఏర్పాటు చేసిన డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ (డీసీఏ) అభిప్రాయం వ్యక్తం చేసింది. జాతీయ స్థాయిలో సైబర్ నేరాలు ఎదుర్కొనేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్‌లను సైతం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని డీసీఏ హెడ్ రియర్ అడ్మిరల్ మోహిత్ గుప్తా తెలియజేశారు. సైబర్ నేరాల అదుపులో భాగంగా సైబర్ భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని మోహిత్ గుప్తా స్పష్టం చేశారు. సైబర్ భద్రతా వ్యవస్థపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా పాఠ్యాంశాలుగా సైతం చేర్చాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సైబర్ భద్రతకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం ఉన్న సమాచార టెక్నాలజీ చట్టంలో సరిపడినంతగా లేవని పూణెలోని మిలిటరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన ఒక కార్యక్రమంలో గురువారం తెలియజేశారు. ‘2008లో తీసుకొచ్చిన ఐటీ చట్టాన్ని సైబర్ భద్రతకు సంబంధించి సవరణలు చేయాల్సిన అవసరం చాలా ఉంది.. కొన్ని దేశాల్లో అయితే ప్రత్యేక సైబర్ భద్రతా చట్టాలు ఉన్నాయి.. మరికొన్ని దేశాల్లో ఐటీ చట్టాల్లో ప్రత్యేకించి సైబర్ భద్రతకు సంబంధించిన బైలాస్‌ను రూపొందించారు’ అని గుప్తా స్పష్టం చేశారు. అంకితభావంతో పనిచేసేందుకు వీలుగా ప్రత్యేక సైబర్ భద్రతా చట్టం అవసరమని తన అభిప్రాయమని గుప్తా వెల్లడించారు. సైబర్ క్రైం టాస్క్ఫోర్స్‌తో పాటు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు సైతం ఉండి తీరాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఐటీ బడ్జెట్‌లో పది శాతం కేటాయింపులు సైబర్ భద్రతా వ్యవస్థకు అవసరం అని ఆయన చెప్పారు.