జాతీయ వార్తలు

యోగి యూపీ వీడాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, సెప్టెంబర్ 20: పౌరుల జాతీయ రిజిస్ట్రేషన్ (ఎన్‌ఆర్‌సీ) చేపడితే తొలుత ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రాన్ని వీడాల్సి ఉంటుందని సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. బీఎస్‌పి నాయకులు దయారామ్ పాల్, మిథాయి లాల్ భారతి శుక్రవారం సమాజ్‌వాది పార్టీలో చేరారు. అఖిలేష్ వారికి స్వాగతం పలికారు. మాజీ ముఖ్యమంత్రి మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ యూపీ విభాగానికి దయారామ్ పాల్ అధ్యక్షునిగా ఉన్నారు. చేరికల అనంతరం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ పౌరుల జాతీయ రిజిస్ట్రేషన్ అమలు గురించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రకటనను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి యోగి చెప్పినట్లుగా ఎన్‌ఆర్‌సీని అమలు చేస్తే తొలుత యోగినే రాష్ట్రాన్ని వీడి తన సొంత రాష్టమ్రైన ఉత్తరాఖండ్‌కు వెళ్ళాల్సి వస్తుందన్నారు. ఎన్‌ఆర్‌సీ అనేది రాజకీయాల్లో భయాన్ని కలిగించే మాధ్యమం మాత్రమేనని అన్నారు. గతంలో విభజించు పాలించు అనేది ఉండేదని, ఇప్పుడు ప్రజల్లో భయాన్ని కల్పించేందుకు దీనిని ఉపయోగించాలనుకుంటున్నట్లు అర్థమవుతున్నదని ఆయన విమర్శించారు. జమ్మూ-కాశ్మీర్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల పట్ల అఖిలేష్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను తొలగించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొన్నదని ప్రభుత్వం చెబుతున్నదని ఆయన తెలిపారు.
అదే నిజమైతే ప్రభుత్వం ఎన్నో ఆంక్షలను విధించిందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాకిస్తాన్‌ను చూపించి ఓట్లు అడుగుతున్నదని ఆయన దుయ్యబట్టారు. అదే పాక్ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీని గగనతలంపై నుంచి వెళ్ళేందుకు ఆ దేశం అనుమతించలేదని ఆయన చెప్పారు. పాక్ కంటే చైనా ప్రమాదకరమైందన్నారు. కాబట్టి దేశ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని అఖిలేష్ డిమాండ్ చేశారు.