జాతీయ వార్తలు

వాహనదారుల భద్రత కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 20: మోటారు వాహనాల చట్టంలో ఇటీవల తీసుకొచ్చిన మార్పుల్లో భాగంగా జరిమానాలను పెంపు అంశంపై కేంద్ర రోడ్డు, రవాణా వాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ‘ఇండియా టుడే’ సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ జరిమానాలను విపరీతంగా పెంచడాన్ని ప్రస్తావించారు. జరిమానాల పెంపు అనేది ప్రభుత్వ ఖజానాలను నింపుకోవడానికి కాదు.. ప్రజల ప్రాణాలను రక్షించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని గతంలో తన కుటుంబానికి జరిగిన ఓ ప్రమాద ఘటనను గుర్తుచేస్తూ గడ్కరీ వ్యాఖ్యానించారు. ‘్భరీగా జరిమానాలు విధించడాన్ని రెవెన్యూ పెంపుకోసం ఎంతమాత్రం కాదు.. ప్రాణాలు కాపాడడమే దీని ప్రధాన ఉద్దేశం’ అని సదస్సులో గడ్కరీ పేర్కొన్నారు. దేశంలో ఏటా ఐదు లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయనీ.. దాదాపు లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోతుండగా.. మూడు లక్షల మంది అంగవైకల్యం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో బాధితులు కేవలం 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్కులే కావడం గమనార్హమని అన్నారు. గుజరాత్ తదితర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సైతం మోటారు వాహనాల చట్టంపై వస్తున్న వ్యతిరేకతపై ప్రశ్నించగా.. ‘మీరెందుకు అలా అంటున్నారు.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం చట్టంలో సవరణలను ఆమోదించి మద్దతు తెలిపారన్న సంగతి గుర్తుంచుకోండి’ అని గడ్కరీ బదులిచ్చారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత అనుభవాలను ప్రస్తావించారు. తాను మహారాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కుటుంబంతో కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిందనీ.. ఈ ప్రమాదంలో తమ కుటుంబం గాయాలపాలై సంవత్సరానికి పైగా బాధపడ్డామని గుర్తుచేసుకొన్నారు. ‘జరిమానాల అమలు అంశం కేవలం ఆయా రాష్ట్రాల విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది’ అని గడ్కరీ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎంవీ చట్టంలో తీసుకొచ్చిన మార్పులపై వస్తున్న వ్యతిరేకతను ప్రశ్నించగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. చట్టంలో పేర్కొన్న కనీస, గరిష్ట జరిమానాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మార్చుకోవచ్చని ఈ సందర్భంగా గడ్కరీ సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం గురించి ప్రస్తావించగా.. ‘ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే’ అన్నారు. ‘ఒడిదుడుకులు శాశ్వతం కాదు.. జీడీపీ మళ్లీ పుంజుకుంటుంది’ అని చెప్పారు. అమెరికా, చైనాల కన్నా మన దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు. మనం సానుకూల ధోరణిలో ఉందాం.. ఆర్థిక వ్యవస్థ తప్పక పుంజుకుంటుందని’ పేర్కొన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను భారత్ కచ్చితంగా చేరుకొంటుంది అని గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు.