జాతీయ వార్తలు

ప్రపంచమంతా హర్షిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పాకిస్తాన్ ఇప్పటికయినా తన తప్పు తెలుసుకుని భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోయడాన్ని ఆపుతుందన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యక్తం చేవారు. అంతేకాదు చొరబాట్లను ఆపేందుకు సైన్యానికి ఉన్న బాధ్యతల్లో భాగంగానే ఈ దాడులు జరిగాయని ఆయన స్పష్టం చేస్తూ, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాల కోసం తమ భూభాగాన్ని ఉపయోగించుకోనివ్వబోమని 2014 జనవరిలో ఇచ్చిన హామీని పాక్ నిలబెట్టుకోలేదని, పైగా భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని అన్నారు. ‘ఉగ్రవాద కార్యకలాపాలకు తమ భూభాగాన్ని అనుమతించవద్దని పాకిస్తాన్‌ను భారత్ పదే పదే కోరుతూ వచ్చింది. అయితే వాళ్లు తమ హామీని నిలబెట్టుకోలేదు. అంతేకాదు, ఇన్ని రోజులుగా ఉగ్రవాదానికి తోడ్పాటు అందించడం, ప్రోత్సహించడం, నిధులను సమకూర్చడం చేస్తూ వచ్చారు. ఇటీవలి కాలంలో భారత్ భూభాగంలోకి చొరబడడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి’ అని వెంకయ్య నాయుడు అన్నారు.
పాక్ గడ్డపైనుంచి వెలువడుతున్న ప్రభుత్వ ప్రోత్సాహిత ఉగ్రవాదం ఒక్క భారత్‌కే కాకుండా దక్షిణాసియాకు, మొత్తం ప్రపంచానికే ముప్పుగా మారిందని ఆయన అన్నారు. దక్షిణాసియా ప్రాంతంలో శాంతి పరిరక్షణ దిశగా తనవంతు బాధ్యతను పాక్ అర్థం చేసుకోవాలని ఆయన అంటూ, ఇప్పటికయినా పాక్ తన తప్పును గ్రహించి, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోయడాన్ని నిలిపివేస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ‘పాక్‌తో అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి భారత్ సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేసిందని, అయితే దురదృష్టవశాత్తు పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే మార్గాన్ని ఎంచుకుంది’ అని వెంకయ్యనాయుడు అన్నారు. భారత్ తీసుకున్న సానుకూల చర్యలన్నిటికీ పాక్ ఉగ్రవాదులను మరింత ప్రోత్సహించడం, ఉగ్రవాద చర్యలను సమర్థించడం ద్వారా ప్రతిస్పందించిందన్నారు.ఉరీ ఉగ్రవాద దాడి తర్వాత దేశం యావత్తు ఆగ్రహంతో మండిపోయిందని, ఇలాంటి చర్యలను సహించేది లేదని, దేశ భద్రత, రక్షణ కోసం తగిన రీతిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హామీ ఇచ్చారని వెంకయ్య నాయుడు అన్నారు. బుధవారం రాత్రి మన సైన్యం జరిపిన దాడులు దేశ సమైక్యత, భద్రతను కాపాడడమనే వారి బాధ్యతలో భాగమేనని ఆయన అంటూ, మోదీ, సైన్యం చేతిలో దేశం భద్రంగా ఉందని ఈ దాడి నిరూపించిందని ఆయన అన్నారు.
ఉగ్రవాదుల చొరబాట్లను తిప్పి కొట్టడానికి సైన్యం తీసుకున్న చర్యను ప్రపంచం నలుమూలలా ఉన్న భారతీయులు ప్రశంసిస్తున్నారని ఆయన అన్నారు. భారత దేశం శాంతికాముక దేశమని, అయితే ఈ లక్ష్యం నెరవేరాలంటే రెండు దేశాలు కలిసి పని చేస్తేనే సాధ్యమవుతుందని ఆయన అంటూ, ఇప్పటికయినా తన బాధ్యతను గుర్తించాలని ఆయన పాక్‌ను కోరారు.