జాతీయ వార్తలు

వృద్ధులను ఆదరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: వయోవృద్ధులకు సముచిత గౌరవం ఇవ్వాలని, వారికి వైద్య, ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత సమాజంపై ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. పెద్దలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వృద్ధుల దినోత్సవం సందర్భంగా శనివారం ఇక్కడ ఒక కార్యక్రమంలో ఉద్ఘాటించారు. సమాజానికి వారు అందించన సేవలను గుర్తించాలన్నారు. వృద్ధుల యోగక్షేమాలు, వారికి మెరుగైన వసతులు కల్పించేందుకు సమాజం, కుటుంబ సభ్యులు కృషి చేయాలన్నారు. ఇలాంటి బాధ్యతను ఒక్క ప్రభుత్వానికే వదిలేయకుండా సమాజం కూడా బాధ్యత తీసుకోవాలని, ఆ మేరకు అందరిలో మార్పురావాలని ప్రణబ్ పిలుపునిచ్చారు. వద్ధులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశంగా వౌలిక సదుపాయాల కల్పన జరగాలని చెప్పారు.

చిత్రం.. వయోశ్రేష్ఠ సమ్మాన్ అవార్డును అందజేస్తున్న రాష్టప్రతి ప్రణబ్