జాతీయ వార్తలు

నిర్మాణాలను నియంత్రిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పానాజీ, అక్టోబర్ 16: గోవాలోని నావికాదళం స్థావరానికి 20 కిలో మీటర్ల దూరంలో నిర్మాణాలను నియంత్రించాలనుకుంటున్నారా? అని గోవా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వౌవిన్ గొడిన్హొ విమర్శించారు. గోవాలోని నావికాదళం స్థావరానికి 20 కిలో మీటర్ల దూరంలో నిర్మాణాలు చేపట్టరాదంటూ నావికాదళం ప్రతిపాదన చేయడం పట్ల ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా ఆక్షేపించారు. ఈ విషయమై ఈ నెల 22న ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొంటారని ఆయన చెప్పారు. నావికా దళాన్ని గౌరవిస్తామని, సెల్యూట్ చేస్తామని, అయితే తమను పాలిస్తామంటే అంగీకరించమని ఆయన తెలిపారు.