జాతీయ వార్తలు

అంతా..మంచే జరుగుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, అక్టోబర్ 16: అయోధ్య కేసులో అంతా మంచే జరుగుతుందని, రామ మందిరం నిర్మాణానికి మార్గం సులభం అవుతుందని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆశాభావం వ్యక్తం చేసింది. హిందూ, ముస్లిం వర్గాల వాదనలను విన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయాన్ని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ కోగ్జే ప్రస్తావిస్తూ రామ మందిరానికి అనుకూలంగా నిర్ణయం ఉంటుందని ఆశిస్తున్నట్టు ప్రకటించారు. 40 రోజులపాటు సాగిన వాదోపవాదాల్లో వివాదాస్పద భూమి అయోధ్య రాముడిదేనని నిరూపించగలిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. తీర్పు వెలువడిన వెంటనే అయోధ్య రామ మందిరం నిర్మాణానికి చర్యలు చేపట్టాలని గతంలో మధ్యప్రదేశ్, రాజస్తాన్ హైకోర్టుల్లో జడ్జిగా పనిచేసిన కోగ్జే కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ కేసు సత్వర పరిష్కారానికి రోజువారీ విచారణ చేపట్టి పూర్తి చేయడం అభినందనీయమని ఆయన వ్యాఖ్యానించారు.