జాతీయ వార్తలు

జూ కంచెదూకి.. సింహం ముందుకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: దేశ రాజధాని ఢిల్లీలోని జూలో గురువారం ఓ సంఘటన కలకలం రేపింది. 28 ఏళ్ల ఓ వ్యక్తి జంతు ప్రదర్శనశాల కంచె దూకేసి సింహానికి ఎదురుగా వెళ్లి నిలబడ్డాడు. సింహం ఎదురుగా నిలబడి రకరకాల చేష్టలు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జూ సిబ్బంది అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బతికిపోయాడు. గురువారం మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బిహార్‌లోని తూర్పు ఛంపారాన్ జిల్లాకు చెందిన రెహాన్ ఖాన్ ఢిల్లీలోని సీలాంపూర్‌లో ఉంటున్నాడు. మధ్యాహ్నం జూకు చేరుకున్న ఖాన్ అకస్మాత్తుగా కంచె దూకేశాడు. గబగబ వెళ్లిపోయి ఓ సింహం ఎదురుగా నిలబడ్డాడు. కాసేపున్నాక దాని ముందే కూర్చోవడం..పడుకోవడం చేశాడు. చాలా సేపుశాంతంగా ఉన్న మృగరాజు విజృంభించేందుకు ఉపక్రమించబోయింది. ఈలోగా అప్రమత్తమైన జూ సిబ్బంది రంగంలోకి దిగి ఖాన్‌ను లాక్కొచ్చారు. దీంతో అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. అతడి చేష్టలు చూస్తున్న వారు బిగ్గరగా కేకలు వేశారు. వెనక్కి రమ్మని అరిచారు. అయినా పట్టించుకోలేదని జూ అధికారి ఒకరు వెల్లడించారు. సింహం పంజా విసురుతుందనగా సిబ్బంది రంగంలోదిగి అతడిని రక్షించారు. రెహాన్ ఖాన్‌కు మతిస్థిమితం లేదని పోలీసులు చెప్పారు. అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 2014 సెప్టెంబర్‌లో ఓ వ్యక్తి సింహాల బోనువద్దకు దూకగా, ఓ తెల్ల సింహం అతడిని చంపేసింది. గురువారం ఆ సంఘటనే గుర్తుచేసుకుని సందర్శకులు భీతిల్లారు. సిబ్బంది పుణ్యమాని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.