జాతీయ వార్తలు

కాంగ్రెస్ అభ్యర్థుల గగ్గోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఎన్నికల్లో విజయం సంగతి ఎలా ఉన్నా, కనీసం ఎన్నికల్లో సరైన ప్రచారం కూడా లేకుండాపోయిందని కాంగ్రెస్ అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మహారాష్ట్ర, హర్యానా శాసన సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని తెలిసి అభ్యర్థులు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. సోనియా ప్రచారం చేయకపోతే రెండు రాష్ట్రాల్లో అభ్యర్థుల విజయాకాశాలు దెబ్బతింటాయని సీనియర్లు భయపడుతున్నారు. కాగా శుక్రవారం హర్యానాలోని మహేంద్రగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిన సోనియాగాంధీ ఆఖరు క్షణంలో తన పర్యటనను రద్దుచేసుకున్నారు. దీంతో హర్యానా శాసన సభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు గందరగోళంలో పడిపోయారు. సోనియా గాంధీ అనారోగ్య కారణాల వల్లనే మహేంద్రగిరిలో ఎన్నికల ప్రచార సభకు హాజరు కాలేకపోయారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. తొలుత సోనియా గాంధీ మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో రెండు విడతలుగా అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేయాలనుకున్నారు. దీని కోసం రెండు రాష్ట్రాల్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ఎంపిక చేసి అక్కడ సోనియా బహిరంగ సభల కోసం అవసరమైన ఏర్పాట్లు కూడా చేసేశారు. అయితే అనారోగ్యంతోపాటు పలు ఇతర కారణాల వల్ల సోనియా గాంధీ మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఒక్క ఎన్నికల సభకు కూడా హాజరు కాలేకపోయారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసన సభలకు వచ్చే సోమవారం పోలింగ్ జరుగనుంది. ఒక వైపు సోనియా ప్రచారానికి దూరంగా ఉండడం, మరోవైపురాహుల్ గాంధీ ఎన్నికల సభల్లో చేసిన ప్రసంగాలు తమ విజయావకాశాలను దెబ్బ తీశాయని కాంగ్రెస్ అభ్యర్థులు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ మహారాష్టల్రో రెండు రోజులు, హర్యానాలో రెండు రోజులు ప్రచారం చేశారు. ఈ సభల్లో ప్రధాని మోదీపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. యువత ఉపాధి కోరుతుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఆర్టికల్ 370 రద్దు, చంద్రయాన్-2 గురించి చెబుతున్నారంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఇవి రెండు రాష్ట్రాల ఓటర్లను ఏమాత్రం ఆకట్టుకోలేదని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం వల్ల కాంగ్రెస్ అభ్యర్థులకు కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు సోనియా గాంధీ ప్రయత్నించాలని కాంగ్రెస్ అభ్యర్థులు ఆశించారు. సోనియా మహారాష్ట్ర, హర్యానాలో ప్రచారం చేస్తే తమ విజయావకాశాలు బాగా మెరుగుపడతాయని వారు భావించారు. అయితే ఆమె మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. హర్యానాలో ఆఖరు రోజు ఎన్నికల ప్రచారం చేయటం ద్వారా పార్టీ అభ్యర్థుల మనోస్థైర్యాన్ని పెంచాలని సోనియా గాంధీ భావించారు. ఆఖరు క్షణంలో అనారోగ్యం మూలంగా మహేంద్రగిరిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభకు హాజరు కాలేకపోయారు. కాగా సోనియా గాంధీ 2017 నుండి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. సోనియా గాంధీ ఆఖరుసారి 2017లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఆ ప్రచారంలో ఆమె గాయపడ్డారు. వారణాసి రోడ్‌షోలో జారిపడి గాయాల పాలయ్యారు. ఆరోజు నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం లేదు. ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా శాసన సభ ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉండటంతో సోనియా గాంధీ ఇక మీదట ఎన్నికల ప్రచారం చేయరనేది స్పష్టమైపోయింది.