జాతీయ వార్తలు

తాగునీటికి మొదటి ప్రాధాన్యత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: తాగు నీటి లభ్యత మొదటి ప్రాధాన్యతనివ్వాలని, పరిశ్రమలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటి) పరిశ్రమల శాఖకు సూచించింది. భూగర్భ జలాలు తీవ్రంగా దోపిడీకి గురైన ప్రాంతాలు గుర్తించబడ్డాయని, వాణిజ్య అవసరాల కోసం భూగర్భ జలాలను వినియోగించడాన్ని నియంత్రించాల్సి ఉందని గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటీ) ప్యానల్ పేర్కొంది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్ పర్సన్ జస్టిస్ ఎకే గోయల్ నేతృత్వంలోని బెంచ్ భూగర్భ జలాల వినియోగం అంశంపై విచారణ చేపట్టింది. పరిశ్రమలకు కావాల్సినంత నీటి లభ్యత లేకపోవడం వల్ల భూగర్భ జలాలను నియంత్రణ లేకుండా వినియోగించడం సమంజసం కాదని ఎన్‌జిటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఎకే గోయల్ శుక్రవారం వ్యాఖ్యానించారు. నీటి కొరత ఉన్నది వాస్తవమేనని ఆయన తెలిపారు. అయితే వాణిజ్య అవసరాలకు భూగర్భ జలాలను నియంత్రణ లేకుండా తోడడం కాదని అన్నారు. పరిశ్రమలకు కావాల్సిన నీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సంబంధిత శాఖలు చూపించాలని తెలిపారు. పరిశ్రమలకు అనుమతి ఇచ్చేప్పుడే వౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నీటి లభ్యత ఏ మేరకు ఉందో, అవసరాలకు తగిన విధంగా అందించడగలమా అనే కోణం లో పరిశీలించాలని అన్నారు. అవసరమైతే నీటి కొరత లేని ప్రాంతాలకు పరిశ్రమలను మార్చే అంశంపైనా ఆలోచన చేయాలని సూచించారు. కేంద్ర భూగర్భ జలాల అథారిటీ నుంచి నో-అబ్జెక్షన్ సర్ట్ఫికేట్ (ఎన్‌వోసీ) లేకుండానే భూగర్భ జలాలను వాడుకున్నట్లయితే ఆ పరిశ్రమలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.