జాతీయ వార్తలు

ఆర్థిక వ్యవస్థపై మీకు అవగాహనే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేంద్రగఢ్ (హర్యానా), అక్టోబర్ 18: దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రధాని నరేంద్ర మోదీకి ఏ రకమైన అవగాహన లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేరీతిలో మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానాల కారణంగా భారతదేశాన్ని చూసి ప్రపంచ దేశాలు నవ్వుకుంటున్నాయని శుక్రవారంనాడు ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ అన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించిన రాహుల్ ‘పెద్ద నోట్ల రద్దు, గబ్బర్ సింగ్ ట్యాక్స్ వల్ల చిన్న, మధ్యశ్రేణి పరిశ్రమలు ఘోరంగా దెబ్బతిన్నాయి’ అని అన్నారు. ప్రస్తుతం భారత్‌లోని స్థితిగతులను చూసి ప్రపంచ దేశాలు అవహేళన చేస్తున్నాయని పేర్కొన్న ఆయన ‘ఒకప్పుడు ప్రపంచానికే మార్గదర్శనం చేసిన భారతావని ఇపుడు కుల, మత ఘర్షణలతో అట్టుడుకుతోంది. దేశ గౌరవాన్ని, ఆర్థిక వ్యవస్థను నరేంద్ర మోదీ ధ్వంసం చేశారు’ అని రాహుల్ అన్నారు. మీడియా కూడా వాస్తవాలను వెలుగులోకి తేవడం లేదని ఆరోపించారు. ‘మాకు వాస్తవాలు తెలుసు. కానీ వాటిని వెల్లడించలేం. ఎందుకంటే మా ఉద్యోగాలు పోతాయి’ అని మీడియా వ్యక్తులు అంటున్నారని రాహుల్ అన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మోదీ విమర్శించడాన్ని ప్రస్తావించిన రాహుల్ అసలు దేశ ఆర్థిక వ్యవస్థపైన మోదీకి అవగాహన లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎక్కడికి వెళ్లినా ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని, హిందూ, ముస్లింలైనా, జాట్‌లు, నాన్ జాట్‌లైనా వారి మధ్య ఘర్షణలనే కమలనాథులు రగిలిస్తున్నారని ఆయన అన్నారు. ఈ రకమైన విచ్ఛిన్నకర రాజకీయాల వల్ల దేశ పురోగతి ఎంతమాత్రం సాధ్యం కాదని ఆయన తెలిపారు.