జాతీయ వార్తలు

అధికారంలోకి వస్తే.. 370 అధికరణ రద్దు చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవాపూర్ (మహారాష్ట్ర): కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే 370 అధికరణను పునరుద్ధరిస్తామని ప్రకటించాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సవాల్ చేశారు. మహారాష్టల్రోని గిరిజన జిల్లా నన్‌దర్బార్‌లోని నవాపూర్ ప్రాంతంలో శనివారం జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన ఆయన జమ్మూకాశ్మీర్‌కు సంబంధించిన ప్రత్యేక హోదాను రద్దు చేయడం ద్వారా మోదీ ప్రభుత్వం దేశంలో కాశ్మీర్ విలీనాన్ని పరిపూర్ణం చేసిందని స్పష్టం చేశారు. ఈ అధికరణ కారణంగానే కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రేరేపిస్తూ రాగలిగిందని, దీనివల్ల 40 వేల మంది ప్రజలు మరణించారని అమిత్ షా అన్నారు. అలాగే, దశాబ్దాలపాటు కాశ్మీర్ అభివృద్ధి కూడా స్తంభించిపోయిందని, అయినప్పటికి కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 370 అధికరణను కొనసాగించిందే తప్ప దానిని రద్దు చేసే ప్రయత్నం చేయలేదని అన్నారు. కేవలం తన రాజకీయ ప్రయోజనాలను పరిరక్షించుకునే అంశానికే కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యత ఇచ్చారని, దేశ సంక్షేమాన్ని, జాతీయ భద్రతను తుంగలో తొక్కారని అమిత్ షా విరుచుకుపడ్డారు. దశాబ్దాలపాటు కేంద్రంలో అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రధానమంత్రులు ఎవరూ చేయలేని సాహసాన్ని నరేంద్ర మోదీ చేశారని, రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే 370 అధికారణను రద్దు చేసి కాశ్మీర్‌ను మిగతా రాష్ట్రాలతోపాటు దేశంలో సమానమైన రాష్ట్రంగా చేశారని ఆయన అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు, కాశ్మీర్‌కు సంబంధించిన 370 అధికరణ రద్దుకు సంబంధం ఏమిటమని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారని పేర్కొన్న అమిత్ షా ‘అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగ అధికరణను పునరుద్ధరిస్తామని దమ్ముంటే ప్రకటించండి. అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మరోరోజు వ్యవధి ఉంది. మీరీ ప్రకటన చేస్తే ప్రజల నుంచి ఏరకమైన ప్రతిస్పందన వస్తుందో మీరే చూస్తారు’ అని అమిత్ షా సవాల్ విసిరారు. భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగం కావడం ఇష్టం లేదా అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించిన ఆయన గిరిజనాభివృద్ధికి మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మొత్తం 115 గ్రామాలను గిరిజన అభివృద్ధి పథకం కింద చేర్చామని, రానున్న ఐదేళ్ల కాలంలో నన్‌దర్బార్ జిల్లా కూడా దేశంలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారుతుందని ఆయన తెలిపారు. అలాగే, మహారాష్టన్రు కూడా దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామని ఆయన అన్నారు. ఫడ్నవిస్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, కేంద్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటును ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. గిరిజన సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి పనిచేశాయని, ఇందుకోసం ఎన్నో పథకాలను అమలు చేశాయని ఆయన తెలిపారు. అలాగే, గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల కోసం ప్రత్యేక సంస్మరణ కేంద్రాలను కూడా నిర్మించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్న ఆయన ఇప్పటికే ఏకలవ్య మోడల్ స్కూల్స్‌ను ప్రారంభించామని తెలిపారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల ప్రయోజనాలను పట్టించుకోలేదని, వారిని కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తూ వచ్చిందని అన్నారు. ఓబీసీల సంక్షేమానికి సంబంధించి కూడా గత 55 సంవత్సరాల్లో కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని అన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన అతి తక్కువ వ్యవధిలోనే ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించామని అమిత్ షా వెల్లడించారు.

*చిత్రం...కేంద్ర హోం మంత్రి అమిత్ షా