జాతీయ వార్తలు

శివకుమార్ స్వామికి ‘ భారతరత్న’ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 20: కేంద్ర ప్రభు త్వం హిందూ మహాసభ నాయకుడు వీర సావర్కర్‌కు బదులు ఈ సంవత్సరం జనవరిలో పరమపదించిన లింగాయత్ యోగి శివకుమార్ స్వామికి భారత రత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం సూచించారు. ‘నడిచే దేవుడి’గా పేరు పొందిన శివకుమార్ స్వామీజీ లోకోపకారి, విద్యావేత్త, మానవతావాది. ‘(సావర్కర్‌కు భారత రత్న పురస్కారం ఇచ్చే విషయంలో) బీజేపీ అభిప్రాయం ఏమైనా కానివ్వండి, సావర్కర్‌కు బదులు శివకుమార్ స్వామీజీకి భారత రత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలని నేను అభిప్రాయపడుతున్నాను’ అని సిద్ధ రామయ్య మైసూరులో విలేఖరులతో అన్నారు. మహాత్మా గాంధీ హత్య కేసు నిందితుల్లో సావర్కర్ ఒకరని కొద్ది రోజుల క్రితం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర శాఖ తాము మళ్లీ అధికారంలోకి వస్తే వీర సావర్కర్‌కు మరణానంతరం భారత రత్న పురస్కారాన్ని ప్రదానం చేస్తామని తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ హామీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. మహాత్మా గాంధీ హత్య కేసు నిందితుల్లో సావర్కర్ ఒకరని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. అయితే, ఆయన నిర్దోషిగా బయటపడ్డారనేది వేరే విషయమని సిద్ధరామయ్య అన్నారు. ‘అతనికి ఇప్పుడు భారత రత్న ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము శివకుమార్ స్వామీజీకి భారత రత్న ఇవ్వాలని కోరుతున్నాం. సావర్కర్ హిందూత్వను బలపరిచిన వ్యక్తి కాబట్టి మేము వ్యతిరేకించాం. ఇందులో వివాదాస్పదం ఏముంది?’ అని కాంగ్రెస్ పార్టీ నాయకుడయిన సిద్ధరామయ్య అన్నారు. సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి హోదాలో 2018 జనవరిలో శివకుమార్ స్వామీజీకి భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
*చిత్రం... కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య