జాతీయ వార్తలు

లబ్ధిదారులందరికీ 2021 నాటికి ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం కింద నిర్మించిన మొత్తం 1.12 కోట్ల ఇళ్లలోకి 2021 తొలినాళ్ల నాటికి లబ్ధిదారులు ప్రవేశిస్తారని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 90 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని, వీటి నిర్మాణానికి తమ మంత్రిత్వ శాఖ నిధులు అందజేసిందని ఆయన తెలిపారు. పీఎంఏవై(యూ) పథకం కింద నిర్మించే వీటి సంఖ్య ఆరు నెలల్లో 1.12 కోట్లకు చేరుకుంటుందని ఆయన ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. మోదీ ప్రభుత్వం ‘2022 నాటికి అందరికీ ఇళ్లు’ లక్ష్యాన్ని గడువుకన్నా ముందే చేరుకుంటుందన్న విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఈ ఇళ్ల నిర్మాణ పనులు వడివడిగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. 2020 మార్చి నాటికి మొత్తం 1.12 కోట్ల ఇళ్ల నిర్మాణానికి మంజూరు ఇవ్వడం జరుగుతుందని, 75 లక్షల ఇళ్ల గ్రౌండింగ్ పనులు పూర్తవుతాయని, వచ్చే అయిదారు నెలల్లో 40 లక్షల నుంచి 45 లక్షల ఇళ్లను లబ్ధిదారులు ఆక్రమించుకుంటారని మంత్రి చెప్పారు.