జాతీయ వార్తలు

రెండు రాష్ట్రాల్లోనూ కమల వికాసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: మహారాష్ట్ర, హర్యానా శాసనసభలకు సోమవారం జరిగిన పోలింగ్‌లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించనున్నట్లు వివిధ సంస్థలు, టీవీ చానళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ, దాని మిత్రపక్షాలకు అత్యధిక సీట్లు లభిస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు బాగా వెనుకబడి పోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మహారాష్ట్ర శాసనసభలో మొత్తం 288 సీట్లుంటే ఇందులో బీజేపీ, శివసేన కూటమికి 230 సీట్లు లభించవచ్చునని టైమ్స్ నవ్ అంచనా వేసింది. కాంగ్రెస్, ఎన్‌సీపీ కూటమికి 48 సీట్లు లభిస్తే.. ఇతరులకు 10 సీట్లు లభించవచ్చు. టీవీ-9, మరాఠీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ-శివసేన కూటమికి 197, కాంగ్రెస్-ఎన్‌సీపీకి 75,
ఇతరులకు 16 సీట్లు లభించవచ్చు. సీఎన్‌ఎన్ న్యూస్18-ఐపీఎస్‌ఓఎస్ అంచనా ప్రకారం బీజేపీ కూటమికి 243, కాంగ్రెస్ కూటమికి 41, ఇతరులకు నాలుగు సీట్లు లభించవచ్చు. ఇండియా టుడే-యాక్సిస్ అంచనా ప్రకారం బీజేపీ-శివసేన కూటమికి 166 నుంచి 194, కాంగ్రెస్-ఎన్‌సీపీకి 72 నుంచి 90 సీట్లు, ఇతరులకు 22 నుంచి 34 సీట్ల వరకు లభించవచ్చు.
హర్యానా శాసనసభ పోలింగ్‌పై టైమ్స్ నవ్ జరిపిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మొత్తం 90 సీట్లలో నుండి బీజేపీకి 71, కాంగ్రెస్‌కు 11, ఇతరులకు 8 సీట్లు లభించవచ్చు. టీవీ-9, భారత్ వర్ష్ అంచనా ప్రకారం బీజేపీకి 47, కాంగ్రెస్‌కు 23, ఐఎన్‌ఎల్‌డీకి 9, ఇతరులకు 11 సీట్లు లభించవచ్చు. రిపబ్లిక్ టీవీ-జన్‌కీబాత్ సర్వే ప్రకారం బీజేపీకి 52-63, కాంగ్రెస్‌కు 19-15, ఐఎన్‌ఎల్‌డీ-అకాలీకి ఒక సీటు, ఇతరులకు 12 నుంచి 18 సీట్లు లభించవచ్చు. ఇండియా న్యూస్-పోల్‌స్టార్ట్ సర్వే ప్రకారం బీజేపీకి 75-80 సీట్లు, కాంగ్రెస్‌కు 9-12, ఐఎన్‌ఎల్‌డీ-అకాలీకి 0-1, ఇతరులకు 13 సీట్లు లభించవచ్చు. వివిధ సంస్థలు జరిపిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంగా బీజేపీ కూటమి రెండు రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి రానున్నట్లు అంచనా వేశాయి. రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు, ఆర్థిక శాఖ మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు ఒక పద్ధతి ప్రకారం ప్రచారం నిర్వహించగా.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రచారంతోపాటు ఇతర అన్ని విషయాల్లోనూ బాగా వెనకబడి పోవటం తెలిసిందే. నరేంద్ర మోదీ ట్రిపుల్ తలాక్ చట్టంతోపాటు జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు గురించి ప్రధానంగా ప్రస్తావించటం తెలిసిందే. హర్యానాలో సైనికుల సంఖ్య అత్యధికం కాబట్టి జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించి కేంద్ర పాలిత ప్రాంతం చేయటానికి బాగా మద్దతు లభించిందని అంటున్నారు. దీని పర్యవసానమే హర్యానాలో బీజేపీ సీట్ల సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

*చిత్రం...కర్నాల్ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు సైకిల్ తొక్కుతూ వస్తున్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్