జాతీయ వార్తలు

ఉగ్రవాదమే సార్క్ అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, సరిహద్దు తీవ్రవాదం సార్క్ దేశాల కూటమి ఉనికికే ప్రమాదమని శ్రీలంక ప్రధాన మంత్రి రనిల్ విక్రమసింఘె అన్నారు. సరిహద్దు తీవ్రవాదం సార్క్ కూటమి ముఖ్య అజెండా అని ఆయన స్పష్టం చేశారు. దక్షిణాసియా ఉపఖండంలో 8మంది సభ్యుల మధ్య ఐక్యత లేకపోవటం వల్లనే ఎనిమిది సార్క్ దేశాల మధ్య ఆర్థిక వ్యవహారాలు కుంటుపడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ఆర్థిక సదస్సులో గురువారం పాల్గొన్న ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా సరిహద్దు తీవ్రవాదమే ముఖ్య అజెండా అని ఆయన అన్నారు. భారత్ పాకిస్తాన్‌ల మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయనే భావిస్తున్నామని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర భారత రాజకీయ నేతలు సోనియా, మన్మోహన్‌సింగ్ లాంటి వారు చాలా దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఇక్కడున్న పరిస్థితులను తాను అర్థం చేసుకోగలనని, ఆ కష్టాలు ఎలా ఉంటాయో తనకూ తెలుసని ఆయన అన్నారు.