జాతీయ వార్తలు

నింగిలోకి జిశాట్-18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 6: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన రోదసీ పథంకలో మరో మైలురాయిని అధిరోహించింది.్భరత్‌కు చెందిన జిశాట్-18 ఉపగ్రహాన్ని ఐరోపాకు చెందిన ఏరియన్ 5విఏ-231 రాకెట్‌తో గురువారం ఫ్రెంచ్ గయానాలోని కౌరూ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం ద్వారా భారత్ దేశ టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ మరింత శక్తివంతమవుతుంది. ప్రస్తుతం 14 టెలికం ఉపగ్రహాలు రోదసీలో పనిచేస్తున్నాయి. తాజా ఉపగ్రహంతో వీటి సంఖ్య 15కు చేరుకుంటుంది. గురువారం తెల్లవారుజామున భారత కాలమానం ప్రకారం 2 గంటల ప్రాంతంలో ఏరియన్-5 రాకెట్ ప్రయోగం జరిగింది. 32 నిముషాల 28 సెకన్ల తరువాత జిశాట్-18 ఉపగ్రహం ఈ రాకెట్ నుంచి విడిపోయింది. 3404 కిలోల బరువైన జిశాట్- 18 ఉపగ్రహంలోని సి బ్యాండ్‌లో మొత్తం 48 కమ్యూనికేషన్ ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా అనేక కోణాల్లో భారత్ టెలీకమ్యూనికేషన్ వ్యవస్థను మరింత విస్తృతం చేస్తాయి. రానున్న కొన్ని రోజుల్లో ఈ ఉపగ్రహ పరిభ్రమణ ఎత్తును క్రమంగా పెంచుతామని, అంతిమంగా దీనిని భూ మధ్యరేఖకు ఎగువగా 36 కిలోమీటర్ల ఎత్తుకు అంటే జియో స్టేషనరీ పరిభ్రమణ పరిధిలోకి చేరుస్తామని ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ ప్రయోగ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ శాస్తవ్రేత్తలను అభినందించారు.