జాతీయ వార్తలు

సాక్ష్యాలు చూపాల్సిన అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఆక్రమిత కాశ్మీర్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌లపై భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు జరిపిన మెరపు దాడులకు సంబంధించిన సాక్ష్యాలను వెల్లడించవలసిన అవసరం లేదని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. దేశంపట్ల నమ్మకం, విధేయత లేనివారే మన సైన్యం చేసిన మెరుపు దాడుల విషయంలో అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని, ఇలాంటి వారికి సాక్ష్యాలు చూపించవలసిన అవసరం లేదని ఆయన ప్రకటించారు. మన సైనికులు జరిపిన మెరపుదాడులకు సాక్ష్యాలు చూపించాలంటున్న వారిపై ఆయన పరోక్షంగా దేశ ద్రోహులనే ముద్ర వేశారు. మన సైనికుల ధైర్య, శౌర్య సాహస చర్యలను అనుమానించవలసిన అవసరం ఎవ్వరికీ లేదని ఆయన ప్రకటించారు. తాను నేరుగా ఆలోచించే మనిషినని, దేశ భద్రత కోసం అవసరమైతే వంకరగా ఆలోచించేందుకు వెనకాడబోనని స్పష్టం చేశారు. పారికర్ గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా వద్ద బిజెపి ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడుతూ ఈ విషయాలు తెలిపారు. భారత సైన్యం ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లపై మెరుపుదాడి చేసినట్లు ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారి అంగీకరించిన నేపథ్యంలో మెరుపుదాడుల వీడియోలు లేదా సాక్ష్యాలు వెల్లడించవలసిన అవసరం ఎంత మాత్రం లేదని పారికర్ అభిప్రాయపడ్డారు. దేశ రక్షణకోసం ప్రాణ త్యాగాలు చేసేందుకు మన సైనికులు సిద్ధంగా ఉన్నారని, ప్రాణ త్యాగం కంటే శత్రువులను హతమార్చటం ముఖ్యమని తాను సైనికులతో చెబుతున్నానని తెలిపారు. అక్రమిత కాశ్మీర్‌లో మన సైనికులు జరిపిన మెరుపుదాడుల్లో ఒక్క సైనికుడు కూడా మరణించక పోవటం వారి నైపుణ్యం, గొప్పతనానికి నిదర్శమని ప్రశంసించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసే ముందు శత్రువులను నామరూపాలు లేకుండా చేయాలన్నారు. ఆక్రమిత కాశ్మీర్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌లపై మన సైనికులు జరిపిన మెరుపు దాడులు నూటికి నూరు శాతం పరిపూర్ణ దాడులని మనోహర్ పారికర్ చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మెరపుదాడులతో అవమానాలకు గురైన ఉగ్రవాదులు ఎంతకైనా తెగించే ప్రమాదం ఉన్నందున సైన్యం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

చిత్రం.. ఢిల్లీలో గురువారం జరిగిన ఏషియన్ రీజినల్ ఫోరమ్ సమావేశానికి హాజరైన ప్రతినిధులతో కరచాలనం చేస్తున్న రక్షణ మంత్రి మనోహర్ పారికర్