జాతీయ వార్తలు

ఆర్మీపై మళ్లీ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 6: భారత్‌పై దాడులు చేస్తున్న ఉగ్రవాదులకు తమ మద్దతు, ప్రోత్సాహాలు లేవని పాక్ ప్రభుత్వం ఎంతగా బుకాయిస్తున్నప్పటికీ పాక్ సైన్యం, ఇతర ప్రభుత్వ ఏజన్సీల మద్దతుతోనే ఉగ్రవాదులు జమ్మూ, కాశ్మీర్‌లోని భారత భూభాగాల్లోకి చొరబడుతున్నారని మరోసారి స్పష్టం అయింది. గురువారం జమ్మూ, కాశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా అయిన కుప్వారాలో ఆర్మీ క్యాంప్‌పై దాడి చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టిన సైనికులు వారి వద్దనుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో ఇంజక్షన్లు, మందులు లాంటివి కూడా ఉన్నాయి. మరో ఘటనలో నాల్గో ఉగ్రవాదిని హతమార్చారు. పాక్ కంపెనీలో తయారైనట్లువాటిపై స్పష్టమైన ముద్రలు ఉండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..
గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో భారీ ఆయుధాలు ధరించిన ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ, కుప్వారా జిల్లాలోని లాన్‌గేట్ వద్ద ఉన్న ఆర్మీ క్యాంప్‌లోకి చొచ్చుకు పోవడానికి ప్రయత్నించారు. అయితే అప్రమత్తంగా ఉన్న సైనిక దళాలు ఎదురు కాల్పులు జరపడం ప్రారంభించాయి. భారత సైనికులు జరిపిన దాడుల్లో ముగ్గరు ఉగ్రవాదులు చనిపోయారని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఉగ్రవాదుల దాడిని తిప్పి కొట్టిన తర్వాత సైన్యం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపు జరిపిందని, గాలింపులో చనిపోయిన మిలిటెంట్ల వద్దనుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రాజీవ్ షారంగ్ చెప్పారు. స్వాధీనం చేసుకున్న వాటిలో మూడు ఎకె రైఫిళ్లు, మూడు అండర్ బారెల్ గ్రనేడ్ లాంచర్లు, పెద్ద సంఖ్యలో మ్యాగజైన్లు, తూటాలు, నాలుగు వాకీటాకీ రేడియో సెట్లు, మూడు జిపిఎస్ పరికరాలు, మూడు మొబైల్ ఫోన్లు, డ్రైఫ్రూట్స్, మందులతో పాటుగా ఒక మ్యాప్, మాట్రిక్స్ షీట్ ఉన్నాయి. ‘మిలిటెంట్లనుంచి స్వాధీనం చేసుకున్న మందులపై పాకిస్తానీ మార్కింగ్‌లున్నాయి. మిలిటెంట్లు ముగ్గురూ పాకిస్తానీలేనని దీన్నిబట్టి స్పష్టమవుతోంది’ అని షారంగ్ చెప్పారు. మ్యాప్‌లను, మాట్రిక్స్ షీట్లను విశే్లషిస్తున్నామని, కొత్త విషయాలు తెలియజేస్తే మీడియాకు చెప్తామని ఆయన తెలిపారు. దాడికి పాల్పడింది ముగ్గురు మిలిటెంట్లేనా, ఇంకా ఉన్నారా అని అడగ్గా, మరింతమంది మిలిటెంట్లు ఉండవచ్చని, అయితే తమ కంట పడింది ముగ్గురని ఆయన చెప్పారు. ఉరిలోని ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న ఘటన జరిగి నెల రోజులు కూడా కాకముందే ఇప్పుడు మళ్లీ భారత ఆర్మీ క్యాంప్‌పై దాడికి పాక్ మిలిటెంట్లు యత్నించడం గమనార్హం. ఉరి ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరపు దాడులు జరిపి పలువురు ఉగ్రవాదులను మట్టుపెట్టడం తెలిసిందే.

చిత్రం.. సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు