జాతీయ వార్తలు

2022లో మాదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 8: ఉత్తరప్రదేశ్‌లో 2022లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆపార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను ఎల్లకాలం తప్పుదోవపట్టించలేరని బీజేపీని ఉద్దేశించి అన్నారు. పెద్దనోట్ల రద్దు గాయాలు ఇంకా మానలేదని ఆయన విరుచుకుపడ్డారు. బిడ్డ పుట్టిన రోజు సంతోషంగా జరుపుకోవల్సిన తల్లి పాత నోట్లను మార్చుకోడానికి రోజుల తరబడి బ్యాంకుల ముందు క్యూలో నిలిచి ఉన్న సంఘటనలు ఇంకా ప్రజల కళ్ల ముందు మెదులు తున్నాయని ఆయన అన్నారు.
డిమోనిటైజేషన్ చేసిన ముచ్చటగా మూడో వార్షికోత్సం నిర్వహించుకుంటున్నామని ఆయన వ్యంగ్యోక్తులు విసిరారు. 2016 నవంబర్ 8న నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసింది. 500, 1000 రూపాయల నోట్లు రద్దుచేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ గాయాలు మరింత తీవ్రమయ్యాయి. 2022 ఎన్నికల్లో మేం ఘన విజయం సాధిస్తాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’అని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ప్రకటించారు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా మోదీ ప్రభుత్వ ఏకపక్షంగా పెద్దనోట్లను రద్దు చేశారని, మూడేళ్లయినా ప్రజలు బాధలు తీరలేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలుక ఊడిందన్న చందంగా డిమోనిటేజేషన్ పుణ్యమాని నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని, ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ఆమె విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తొందరపాటు, అవగాహన రాహిత్యం అని మాయావతి పేర్కొన్నారు. నల్లధనం అరికట్టడానికి పెద్దనోట్ల రద్దు చేశామని బీజేపీ చెప్పుకుందని అయితే దాని వల్ల నిరుద్యోగ సమస్య అత్యంత జఠిలమైందని అఖిలేష్ యాదవ్ విమర్శించారు.‘ప్రజల ముఖాల్లో సంతోషం మాయమైంది. ఎవర్ని చూసినా కష్టాలే. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే వారి బాధలన్నీ తీరిపోతాయి’అని ఎస్‌పీ అధినేత స్పష్టం చేశారు. ఇటీవల ఉప ఎన్నికల్లో ప్రజలు ఎస్‌పీని ఆదరించారని ఆయన అన్నారు. డిమోనిటైజేషన్ విజయవంతమైందని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు బ్యాంకులకు ఎంత నగదు తిరిగి వచ్చింది, మార్కెట్‌లోఎంత చలామణి అయిందీ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగం పెరిగిపోయిందని, జీడీపీ దిగజారిపోయిందని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. పక్కదేశాలతో పోల్చుకుంటే భారత రూపాయి విలువ దారణంగా పడిపోయిందని ఆయన చెప్పారు.