జాతీయ వార్తలు

వరంగల్ కోట అభివృద్ధి కి 15 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: తెలంగాణలోని చారిత్రక వరంగల్ కోటను రూ.15.30 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు.
హృదయ్ పథకం కింద దేశంలోని 86 వారసత్వ భవనాలు, కోటలు, ఇతర చారిత్రక కట్టడాలను మొత్తం 114 కోట్ల వ్యయంతో చేయనున్నట్లు వెంకయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ కోటతోపాటు చారిత్రక వారణాశిలోని కబీర్ చౌరా, అమృత్‌సర్‌లోని రంజీత్‌సింగ్ పనోరమా, పూరిలోని జగగ్రహరస్, జగన్నాథ దేవాలయం పరిక్రమ, ప్రఖ్యాత ద్వారకలోని ద్వారకాధీశుడి దేవాలయం, ప్రధాన ఊరేగింపు వీధిని అభివృద్ధి చేయటంతోపాటు పర్యాటకుల కోసం సౌకర్యాలను తీర్చిదిద్దుతారు. చారిత్రక వరంగల్ కోటను 15.30 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తారు. కోటలోని రహదారులు, కాలిబాటలు, ప్రవేశ కేంద్రాలను నాలుగుకోట్ల 17 లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తారు. 10 కోట్ల వ్యయంతో కోటలోని సరస్సులను పునరుద్ధరించటంతోపాటు సివరేజి ట్రీట్‌మెంట్ ప్లాంటును ఏర్పాటు చేస్తారని వెంకయ్య ఒక ప్రకటనలో తెలిపారు. కోట ఉత్తర ద్వారం వద్ద ప్రజా సౌకర్యాలను ఏర్పాటు చేయటంతోపాటు శృంగార భావిని అభివృద్ధి చేసేందుకు రెండుకోట్ల 5 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. ఎనభై లక్షల వ్యయంతో ఉద్యానవనాలను అభివృద్ధి చేయటంతోపాటు అరవై లక్షల వ్యయంతో ఉత్తర ద్వారాన్ని ప్రకాశవంతం చేస్తారు.
వారణాశిలోని కబీర్ చౌరాలో వారసత్వ కాలిబాటల అభివృద్ధితోపాటు ఇతర కార్యక్రమాలు చేపట్టేందుకు 13.25 కోట్లు కేటాయించారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం, రంజీత్‌సింగ్ పనోరమా, గోల్‌బాగ్ తదితర వారసత్వ కేంద్రాలను 57 కోట్ల వ్యయంతో అభృవృద్ధి చేస్తారు. పూరి నగరంలోని జగన్నాథ దేవాలయం పరిక్రమ అభివృద్ధి, ఇతర పనుల కోసం 17 కోట్లు కేటాయించారు. గుజరాత్‌లోని ద్వారకా నగరంలోని ద్వారకాధీశుడి దేవాలయం అభివృద్ధి పనుల కోసం పదికోట్లు కేటాయించారు. ఐదువందల కోట్ల కేటాయింపులో చేపట్టిన హృదయ్ పథకం కింద ఇదివరకే పనె్నండు నగరాలలోని వారసత్వ భవనాలు, ప్రాంతాల అభివృద్ధి చేపట్టినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, కర్నాటకలోని బాదామి, తమిళనాడులోని కాంచీపురం, వెల్లంకిని, రాజస్తాన్‌లోని అజ్మీర్, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బిహార్‌లోని గయలోని వారసత్వ ఆస్తుల అభివృద్ధి చేపట్టినట్లు మంత్రి వెంకయ్య ఆ ప్రకటనలో తెలిపారు.