జాతీయ వార్తలు

అనుమానాలు నివృత్తి చేయాలి: జెసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: సర్జికల్ దాడికి సంబంధించిన వాస్తవాలను బహిరంగ పరచాలని డిమాండ్ చేసేవారందరూ దేశద్రోహులని, సైన్యానికి వ్యతిరేకమంటూ రక్షణ మంత్రి పారికర్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని టిడిపి ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అబద్ధాలు చెప్పే నాయకులను నమ్మే పరిస్థితి ప్రస్తుతం లేదని, అందువల్ల సర్జికల్ స్ట్రైక్ విషయంలో నాయకులు చెబుతున్న మాటాలు ఎలా నమ్మాలని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం నాడు దివాకర్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ భారతీయులందరికీ సైన్యంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చి విస్మరించిన నాయకులు మాటలను ఇప్పడు ఎలా నమ్మాలని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ఎవరి అవసరాలకు తగ్గట్టువారు మాట్లాడుతున్నారని చెప్పారు. సర్జికల్ దాడులు జరిగాయా? లేదా అనే విషయంలో ఇరుదేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇవి ఎన్నికల కోసం చేసిన జిమ్మిక్కుగా జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వాస్తవాలను ప్రజలకు చూపించే ప్రయత్నిం జరగాలన్నారు.