జాతీయ వార్తలు

బర్మేర్‌లో రాజ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మేర్, అక్టోబర్ 8: భారత్-పాక్ సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లాలో సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు, బిఎస్‌ఎఫ్ అధికారులతో కలిసి రాజ్‌నాథ్ సింగ్ జైసల్మేర్‌నుంచి బర్మేర్‌కు చేరుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
హోం మంత్రి శుక్రవారం పాకిస్తాన్‌తో సరిహద్దు కలిగి ఉన్న నాలుగు రాష్ట్రాల హోం మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. బర్మేర్‌లోని మునబావోలోని బిఎస్‌ఎఫ్ ఔట్‌పోస్టు వద్ద రాజ్‌నాథ్ సింగ్ బిఎస్‌ఎఫ్ సీనియర్ అధికారులతోమాట్లాడారు. అనంతరం జరిగిన సైనికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించారు. అనంతరం విలేఖరులతో కొద్దిసేపు మాట్లాడిన రాజ్‌నాథ్ మన జవాన్లు సరిహద్దులను, దేశాన్ని రక్షిస్తున్నారని అన్నారు. సరిహద్దుల్లో తన రెండు రోజుల పర్యటనలో తొలి రోజయిన శుక్రవారంనాడు షాఘర్‌బుల్జ్‌లోని సరిహద్దు ఔట్‌పోస్టును ఇసుక స్కూటర్‌పై వెళ్లి సందర్శించారు. అదే ప్రాంతంలోని మురార్ వద్ద సైనికుల సమ్మేళనంలో కూడా ఆయన మాట్లాడారు.

రాజస్థాన్‌లోని బర్మేర్ సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సైనికులనుద్దేశించి మాట్లాడుతున్న హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
చిత్రంలో హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు