జాతీయ వార్తలు

మిలటరీ స్టేషన్‌ను ప్రారంభించిన రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్హంపూర్, అక్టోబర్ 8: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మిలటరీ స్టేషన్‌ను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ప్రారంభించారు. మిలటరీ స్టేషన్‌కు 2014లో ప్రణబ్ శంకుస్థానం చేశారు. ఈ స్టేషన్ ఏర్పాటుతో కోల్‌కతా, సిలిగురి ప్రాంతాల సేవలందుతాయి. బ్రిటిష్ ప్రభుత్వం హయాంలోనే దీన్ని మిలటరీ కంటోనె్మంట్‌గా వినియోగించుకున్నారు. ఈ చారిత్రక నేపథ్యంలో బెర్హంపూర్ మిలటరీ స్టేషన్ పేరుతో ఇక్కడో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వాస్తవానికి ఇది బెర్హంపూర్ జిల్లా కేంద్రానికి పాతిక కిలోమీటర్ల దూరంలోని నబగ్రామ్‌లో ఉంది. ఈ స్టేషన్‌కు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ప్రారంభోత్సవం చేశారు. 2018 నాటికి అన్ని వౌలిక సదుపాయాలు కల్పిస్తారు. సుమారు 8వేల దళాలు, వారి కుటుంబ సభ్యులు ఉండడానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. బెర్హంపూర్ మిలటరీ స్టేషన్‌ను ఓ మోడల్ కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. తరువాత బిర్‌భూం జిల్లా సరిహద్దునే ఉన్న సూరిలో రహదారిని రాష్టప్రతి ప్రారంభించారు. ఈ రహదారికి ప్రణబ్ తండ్రి కమడా కింకర్ ముఖర్జీ పేరు పెట్టారు.

చిత్రం.. మిలటరీ స్టేషన్‌ను ప్రారంభిస్తున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ