జాతీయ వార్తలు

రాహుల్‌పై మరో కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందౌలి, అక్టోబర్ 8: సైన్యం జరిపిన లక్షిత దాడులను ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకున్నారంటూ వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై స్థానిక కోర్టులో కేసు నమోదయింది. ప్రధానికి పరువునష్టం కలిగించినందుకు శిక్షించాలని కోరుతూ స్థానిక న్యాయవాది సదానంద్ సింగ్‌భారత శిక్షాస్మృతి (ఐపిసి) 500 సెక్షన్ కింద స్థానిక చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. కాగా, కోర్టు ఈ నెల 25న దీనిపై విచారణ జరపనుంది. ప్రధానిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తనతో పాటుగా దేశ ప్రజల మనసులను ఎంతో గాయపరిచాయని న్యాయవాది తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సైనికులు దేశంకోసం బలిదానాలు చేస్తున్న సమయంలో ఈ రాజకీయ నాయకులు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని కూడా ఆయన ఆ పిటిషన్‌లో ఆరోపించారు. ప్రధానిపై ఈ వ్యాఖ్యలకు గాను రాహుల్ గాంధీపై ఇంతకుముందే ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే.