జాతీయ వార్తలు

సైన్యానికి దీపావళి బొనాంజా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: భారత జవాన్లకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక ఇవ్వటానికి సిద్ధమవుతోంది. పండుగ నాటికి కనీసం పది శాతం ఏడో వేతన సంఘం సిఫార్సుల బకాయిలు చెల్లించాలని మోదీ సర్కారు నిర్ణయించినట్లు ఎకనామిక్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఈ వార్త ప్రకారం అక్టోబర్ 30 నాటికి సైనికులు మధ్యంతరంగా పదిశాతం బకాయిలను పొందుతారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 10న ఇచ్చిన ఉత్తర్వులను ఎకనమిక్ టైమ్స్ పత్రిక సంపాదించింది.
‘‘ప్రస్తుతం తీసుకుంటున్న వేతనాలలో పది శాతం ఎరియర్స్‌గా 2016 జనవరి 1నుంచి లెక్కించి సైనికులందరికీ చెల్లించటానికి రాష్టప్రతి ఆమోదం తెలిపారు’’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రక్షణ మంత్రి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.