జాతీయ వార్తలు

కోలుకుంటున్న జయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 13: అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారాలను ఆర్థిక మంత్రి ఓ పన్నీర్ సెల్వంకు అప్పగించడంపై వస్తున్న విమర్శలను అధికార అన్నాడిఎంకె తోసిపుచ్చింది. దీనిపై ప్రతిపక్ష డిఎంకె చేస్తున్న ఆరోపణలు అన్నాడిఎంకె అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి గురువారం ఇక్కడ ఖండించారు. ‘సిఎం జయలలిత కోలుకుంటున్నారు. ఆమె రోజూ దినపత్రికలు చదువుతున్నారు’ అని ఆమె వెల్లడించారు. జయ ఆరోగ్యంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. సిఎం దగ్గర ఉన్న ఎనిమిది శాఖలను పన్నీర్ సెల్వంకు అప్పగించడాన్ని పార్టీ సమర్థించుకుంది. తమ ప్రియతమ అధినేత్రి ఆదేశానుసారమే ఆర్థిక మంత్రికి అధికారాలు అప్పగించినట్టు సరస్వతి స్పష్టం చేశారు. ‘జయ అపస్మారక స్థితిలో లేరు. విజిటర్లను ఆమెకు వైద్యం చేస్తున్న గదిలో అనుమతించకపోవడానికి కారణం ఇన్‌ఫెక్షన్లు వస్తాయనే. వైద్యులనే తప్ప ఎవరినీ లోనికి రానీయడం లేదు. ఈ విషయాలన్నీ జయలలితకు తెలిసే జరుగుతున్నాయి’ అని అన్నాడిఎంకె పేర్కొంది. పన్నీర్ సెల్వంకు అదనపు బాధ్యతలు అప్పగించడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు అర్థం లేదని అన్నారు. గతంలో అవినీతి కేసులో జయ పదవికి రాజీనామా చేసిన సందర్భాల్లోనూ ఆర్థిక మంత్రికి బాధ్యతలు అప్పగించిన విషయాన్ని పార్టీ ప్రతినిధి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

చిత్రం.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ గురువారం
కోయంబత్తూరులోని మరుధామలై మురుగన్ ఆలయానికి కావళ్లతో వచ్చిన ఎఐఎడిఎంకె కార్యకర్తలు