జాతీయ వార్తలు

లక్షిత దాడులు వట్టిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: నియంత్రణ రేఖకు ఆవలి వైపున పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం లక్షిత దాడులు జరిపినట్లు భారత ప్రభుత్వం చెప్పుకోవడాన్ని మన దేశంలో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కొట్టి పారేస్తూ భారత్ గనుక సర్జికల్ దాడులు జరిపి ఉంటే పాక్ వెంటనే ఆ దాడులను తిప్పికొట్టి ఉండేదని అన్నారు. సర్జికల్ దాడులకు సంబంధించి తమ వద్ద కచ్చితమైన వీడియో సాక్ష్యముందని భారత్ చెప్పుకోవడాన్ని సైతం తోసిపారేసిన ఆయన పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని మిర్పూర్‌లోని ఒక పోలీసు అధికారితో భారత్‌కు చెందిన ఒక భారతీయ టీవీ చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ అంతా కట్టుకథ అని బుధవారం ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాసిత్ చెప్పారు. ‘అక్కడ ఎలాంటి సర్జికల్ దాడులు జరగలేదు.. జరిగింది ఇరుపక్షాల మధ్య కాల్పులు మాత్రమే. భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు చనిపోయారు. భారత సైన్యం కాల్పులను పాక్ సైన్యం సమర్థవంతంగా తిప్పి కొట్టింది’ అని బాసిత్ అన్నారు. ‘ఎలాంటి సర్జికల్ దాడులూ జరగలేదు. అలాంటిది జరిగి ఉంటే పాకిస్తాన్ వెంటనే దాన్ని తిప్పికొట్టి ఉండేది.. ప్రతిస్పందించడానికి మాకు పెద్దగా సమయం అక్కర్లేదు. సర్జికల్ దాడి అనే పదాన్ని భారత్‌లో ఇష్టంవచ్చినట్లు ఉపయోగించుకుంటున్నారని నాకు అనిపిస్తోంది.. భారతీయ సైనికులెవరు కూడా నియంత్రణ రేఖను దాటలేదు. ఇరుపక్షాల మధ్య కాల్పులు మాత్రమే జరిగాయి’ అని బాసిత్ అన్నారు.
కాశ్మీర్ సమస్య గురించి మాట్లాడుతూ, ప్రధాన సమస్య అయిన కాశ్మీర్‌పై పాక్‌తో మాట్లాడాలన్న కోరిక భారత్‌కు ఉన్నట్లు తనకు అనిపిస్తోందని ఆయన అన్నారు. ‘ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రదాడి తర్వాత పాక్‌ను నిందించడం లేదా పాక్‌ను ఉగ్రవాద దేశమని అనడం ద్వారా భారత్ సహకారానికి ఉన్న అన్ని తలుపులను మూసేస్తోంది’ అని బాసిత్ అన్నారు. సార్క్ సదస్సు వాయిదా పడడం అన్ని దేశాలకు కూడా పెద్ద నష్టమని, పాకిస్తాన్ ఈ ఏడాది చివర్లో కాకపోయినా వచ్చే ఏడాది అయినా సార్క్ సదస్సును నిర్వహిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.