జాతీయ వార్తలు

పార్లమెంట్ ఆవరణలో ‘ఆప్’ ఎంపీల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: దేశ రాజధాని ఢిల్లీలోని అనధికారిక కాలనీల క్రమబద్ధీకరణ అంశంపై గత నెలలో హామీ ఇచ్చినప్పటికీ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భారతీయ జనతాపార్టీ బిల్లు పెట్టకపోవడాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో బుధవారం ఆందోళన నిర్వహించారు. ‘్ఢల్లీ ప్రజలను చీట్ చేస్తున్నారు’ అంటూ ఆప్ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తా, సుశీల్ గుప్తా, లోక్‌సభ సభ్యుడు నగ్‌వంత్ మాన్‌లు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. శీతాకాల సమావేశాల్లో 27 బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయించినప్పటికీ అందులో ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లోని అనధికార కాలనీల క్రమబద్ధీకరణ బిల్లు ప్రస్తావన లేకపోవడాన్ని నిరసిస్తూ ‘మీరు ఢిల్లీ ప్రజలను మోసం చేస్తున్నారు.. అబద్దాలు చెప్పి వారిని తప్పుదోవ పట్టించారు’ అని నినాదాలు చేశారు. కనీసం ఇప్పుడైనా బిల్లు ప్రవేశపెడతారని ఆశిస్తూ నిరసన చేస్తున్నామని వారు వివరించారు. గత నెల 23న ఢిల్లీలోని అనధికారిక కాలనీల్లో నివాసం ఉంటున్న వారి గృహాలను క్రమబద్ధీకరిస్తామని కేంద్ర క్యాబినెట్ పేర్కొని ఇప్పుడు మాట తప్పిందని ఆరోపించారు. వీరందరికీ ఊరట కలిగించే విధంగా బిల్లు తీసుకొస్తామని కేంద్ర హౌసింగ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి చెప్పారన్నారు. ఈ బిల్లు తేవడం వల్ల ఢిల్లీలోని 1797 అనధికార కాలనీల్లో నివాసం ఉంటున్న 40 లక్షల మందికి లబ్ధి కలుగుతుందని ఆప్ ఎంపీలు స్పష్టం చేశారు. దాదాపుగా 175 చదరపు కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉంటున్న వీరంతా నిరుపేదలేనని ఎంపీలు పేర్కొన్నారు.