జాతీయ వార్తలు

వాల్తేరు డివిజన్ ఉండాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో భాగమైన వాల్తేరు డివిజన్‌ను యథావిధిగా కొనసాగించాలని వైసీపీ సభ్యుడు విజయ సాయిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న వాల్తేరు డివిజన్ భారతీయ రైల్వేలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న డివిజన్లలో అయిదో స్థానంలో ఉందని తెలిపారు. దేశంలో నార్త్-వెస్ట్రన్ రైల్వే జోన్, నార్త్ ఈస్ట్ ప్రాంటియర్ రైల్వేజోన్ల ఉమ్మడి ఆదాయం కంటే వాల్తేరు డివిజన్ ఆదాయం ఎక్కువని తెలిపారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో వాల్తేరు డివిజన్ ఆదాయం తూర్పు తీర రైల్వేలోనే ముడో అత్యధిక ఆదాయ వనరుగా మారిందన్నారు. గణనీయంగా ఎదుగుతున్న వాల్తేరు రైల్వే డివిజన్‌ను మరింతగా ప్రోత్సహించాల్సిందిపోయి వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి దానిని దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోని విజయవాడ డివిజన్ పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ తప్పిదం అనేక సమస్యలకు, అనర్థాలకు దారితీసే ప్రమాదం వుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్గో టెర్మినల్స్, లోకోషెడ్, వ్యాగన్ వర్క్‌షాపుతోపాటు 2300 మంది సిబ్బందికి సరిపడా స్ట్ఫా క్వార్టర్లు ఉన్నాయి. వాల్తేరు డివిజన్‌ను కొనసాగించడం వల్ల రైల్వేలపై అదనపు భారం ఏదీ వుండదని, కాని వాల్తేరు డివిజన్‌ను తరలించడం వలన వౌలిక వసతుల ఏర్పాటుకోసం అవసరమైన ఖర్చులను భరించాల్సివస్తుందని తెలిపారు. ఒక డివిజన్‌ను రద్దు చేయడం అన్నది రైల్వేల చరిత్రలోనే లేదు. అలాంటిది 125 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను రద్దు చేయాలని రైల్వే యాజమాన్యం భావిస్తే అది రవాణాపరంగా పెద్ద తప్పిదం అవుతుంది.. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను సైతం దెబ్బతీసినట్లవుతుందని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ అంశాలను దృష్టికి ఉంచుకుని వాల్తేరు డివిజన్‌ను యథావిధిగా కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాయగడ డివిజన్ సరిహద్దులను ఖరారు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు.
గృహ నిర్మాణానికి రూ.1869 కోట్లు
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థికంగా బలహీనమైన వర్గాల ప్రజల కోసం
1,24,624 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర సహాయం కింద రూ.1869.36 కోట్లు అందజేయాలని నిర్ణయించినట్లు గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి హర్దీప్ పూరి బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.
పోలీసు ఆధునికీకరణకు రూ.82కోట్లు
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు దళాల ఆధునికీకరణ కోసం 2017-18, 2018-19 సంవత్సరాల్లో మొత్తం రూ.82కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్‌రెడ్డి తెలిపారు. విడుదల చేసిన నిధులలో ప్రతిభ ప్రోత్సాహానికి రూ.14.81కోట్లు, పోలీసు సంస్కరణల అమలు ప్రోత్సాహానికి రూ.7.69 కోట్లు, స్టూడెంట్ పోలీసు కేడెట్ కార్యక్రమానికి రూ.1.67 కోట్లు, మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. పోలీసు దళాల ఆధునికీకరణకు 2019-20లో రూ.24.46 కోట్ల కేటాయించినట్టు కిషన్‌రెడ్డి తెలిపారు.
సరోగసీ బిల్లుకు వైసీపీ మద్దతు
సరోగసీశ (అద్దె గర్భం) నియంత్రణ బిల్లు-2019కి వైసీపీ మద్దతు ప్రకటించింది. రాజ్యసభలో బుధవారం ఈ బిల్లుపై జరిగిన చర్చలో వైసీపీ సభ్యుడు విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ నియంత్రణ లేమి కారణంగా దేశంలో సరోగసీ ఒక పరిశ్రమలా విస్తరిస్తూ అద్దె గర్భాలకు అంతర్జాతీయ గమ్యస్థానంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

*చిత్రం... వైసీపీ సభ్యుడు విజయ సాయిరెడ్డి