జాతీయ వార్తలు

మేధాపట్కర్‌కు షోకాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్(ఎన్‌బీఏ) నాయకురాలు మేధాపట్కర్ చిక్కుల్లో పడ్డారు. పాస్‌పోర్టు దరఖాస్తులో పెండింగ్ కేసుల వివరాలు పొందుపరచలేదంటూ ముంబయిలోని ప్రాంతీయ పాస్‌పోర్టు ఆఫీసు (ఆర్‌పీఓ) ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అసమగ్ర సమాచారం ఇచ్చారని, పాస్ పోర్టు ఎందుకు స్వాధీనం చేసుకోకూడదని అధికారులు ప్రశ్నించారు. మేధాపట్కర్‌పై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఆర్‌పీఓ దృష్టికి వచ్చింది. బర్వానీలో మూడు, అలిరాజ్‌పూర్‌లో ఒకటి, మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఐదు కేసులు ఉన్నాయి. అవన్నీ పెండింగ్ కేసులేనని అధికారులు తెలిపారు. ‘మీపై ఉన్న పెండింగ్ కేసులు వెల్లడించకుండా 2017 మార్చి 30న పాస్‌పోర్టు పొందారు. ఇది చట్ట విరుద్ధం. 1967 పాస్‌పోర్టు చట్టంలోని 12(1) సెక్షన్ కింద చర్య తీసుకోవచ్చు’అని ఆర్‌పీఓ స్పష్టం చేసింది. పది రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఈనెల 18న మేధాపట్కర్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. నోటీసుకు సకాలంలో స్పందించకపోతే చర్యలు తీసుకోవల్సి వస్తుందని పాస్‌పోర్టు అధికారులు హెచ్చరించారు. మేధాపట్కర్ తనపై ఉన్న కేసులను వివరాలు వెల్లడించకుం పాస్‌పోర్టు పొందారని జూన్‌లో ఓ విలేఖరి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ముంబయి ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారులు సామాజిక కార్యకర్త పట్కర్‌కు నోటీసు జారీ చేశారు. మేధాపట్కర్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ముంబ యి(ఈశాన్య) నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పెండింగ్ కేసుల వివరాలు, తప్పుడు సమాచారం ఇచ్చిన పక్షంలో రెండేళ్ల జైలు శిక్ష లేదా ఐదు వేలు అంతకన్నా ఎక్కువ జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండు శిక్షలూ అనుభవించాల్సి ఉంటుంది.
*చిత్రం... మేధాపట్కర్