జాతీయ వార్తలు

కాశ్మీర్ సరిహద్దుల్లో గస్తీజవాన్లకు మొబైల్ జామర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నౌషేరా(జమ్మూ, కాశ్మీర్), అక్టోబర్ 13: పాకిస్తాన్ సైన్యం, మిలిటెంట్లు సరిహద్దుల్లో ఆర్మీ కాన్వాయ్‌లను లక్ష్యంగా చేసుకుని రిమోట్ కంట్రోల్‌ద్వారా పలు మందుపాతర పేలుళ్లు జరిపిన తర్వాత భారత సైన్యం ఇప్పుడు జమ్మూ, కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వద్ద గస్తీ నిర్వహించే సమయంలో రక్షణ కోసం మొబైల్ జామర్లను తమ వెంట తీసుకెళ్తున్నారు.
రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చే మందుపాతరలను (ఐఇడి) నిర్వీర్యం చేసేందుకు గస్తీ బృందంలోని జవాను ఒకరు జామర్లను తీసుకెళ్లడంలో ఇప్పుడు డ్యూటీలో భాగంగా ఉంటోంది. బ్యాటరీలతో కలుపుకొని సుమారు 80 కిలోల బరువుండే ఈ పరికరం మొబైల్ గస్తీ నిర్వహించేటప్పుడు 50 మీటర్ల పరిధిలోని ఏ ఫ్రీక్వెన్సీల(తరంగాలను)నైనా జామ్ చేయగలదని జామర్‌ను ఆపరేట్ చేసే సైనికులు అంటున్నారు. నియంత్రణ రేఖ వద్ద గస్తీ నిర్వహణ సమయంలో కానీ చొరబాట్ల నిరోధంలాంటి ఇతర ఆపరేషన్ల సమయంలో కానీ ఈ జామర్లు తమ వెంట ఉండే వస్తువుల్లో ఒక భాగమై పోయాయని భుజాన ఈ జామరును తీసుకు వెళ్తున్న ఓ సిపాయి సరిహద్దు ప్రాంతాలను సందర్శించిన మీడియా ప్రతినిధులతో అన్నాడు. నియంత్రణ రేఖ వెంబడి జరిపే ఐఇడిల పేలుళ్లకు వ్యతిరేకంగా తీసుకున్న భద్రతా చర్యల్లో ఇదొకటని నౌషేరా సెక్టార్‌లో కొండల ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్న ఆ జవాను చెప్పాడు. సైన్యం కోసం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డిఆర్‌డిఓ) ఈ జామర్లకు రూప కల్పన చేసింది. ప్రముఖులు, భద్రతా దళాల వాహన శ్రేణిలకు రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చే ఐఇడిలనుంచి రక్షణ కల్పించడానికి దేశీయ పరిజ్ఞానంతో ఈ జామర్లను అభివృద్ధి చేశారు.