జాతీయ వార్తలు

వృద్ధుల ప్రయోజనాలకు చట్ట సవరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: దేశంలోని కోట్లాది మంది వయో వృద్ధుల ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించిన చట్ట సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వయోవృద్ధుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం తల్లిదండ్రులు, వృద్ధుల సంక్షేమ పరిరక్షణ చట్టాన్ని సవరించాలని మోదీ ప్రభుత్వం ప్రతిపాదించింది. తల్లిదండ్రుల, వయో వృద్ధులకు ప్రాథమిక సౌకర్యలు, భద్రత కల్పించడం ఈ సవరణ బిల్లు ఉద్దేశ్యం. వృద్ధుల హోమ్స్‌లలో కనీస నాణ్యత ఉండేలా చూడడం, హోం కేర్ సర్వీస్ సెంటర్లు, ఏజెన్సీల రిజిష్ట్రేషన్ వ్యవస్థను సవరణ బిల్లులో పొందుపరిచారు. సవరణ బిల్లు ప్రకారం ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇతర సంస్థలు, ఏజెన్సీలు ప్రభుత్వం వద్ద తమను రిజిష్టరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సవరణ బిల్లును ఈ వారంతంలోగా పార్లమెంటులో ప్రతిపాదిస్తామని సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ తెలిపారు.