జాతీయ వార్తలు

మన సైన్యం ఎవరికీ తీసిపోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండీ, అక్టోబర్ 18: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సైన్యం నిర్వహించిన ఉగ్రవాద లక్షిత దాడులను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇజ్రాయెల్ సైనిక దాడులతో పోల్చారు. ‘ఇటీవలి కాలంలో భారత సైన్యం శౌర్యం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. గతంలో ఇజ్రాయెల్ తన శత్రు దేశాలు, ఉగ్రవాద శిబిరాలపై లక్షిత దాడులు చేసేదని మనం వినేవాళ్లం. ఇప్పుడు మన సైన్యం ఎవరికీ తీసిపోదని రుజువైంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మంగళవారం నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో ఆయన మాట్లాడారు. లక్షిత దాడులను బిజెపి తన రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకుంటోందన్న విపక్షాల ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. సామాన్య ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకుపోవటం వెనుక ప్రధాన కారణం భారత సైన్యం నైతిక స్థైర్యాన్ని మరింత పెంచటం కోసమేనని మోదీ స్పష్టం చేశారు. సైనిక బలగాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. నాలుగు దశాబ్దాలపాటు ఆరని చిచ్చుగా ఉన్న ఒక ర్యాంకు, ఒక పెన్షన్ పథకాన్ని తమ ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరించిందని మోదీ పేర్కొన్నారు. తమ ముందున్న ప్రభుత్వాలు ఈ అంశాన్ని ముట్టుకోవటానికే భయపడ్డాయని అన్నారు. ఒకటి రెండు ప్రభుత్వాలు రూ.200 కోట్లు, రూ.500 కోట్లు విడుదల చేయటం మినహా వాస్తవంగా కేంద్రంపై ఎంత భారం పడుతుందన్న అంశాన్ని సైతం విశే్లషించలేకపోయాయన్నారు. ‘నేను చేశాను. ఆర్థిక భారం నానాటికీ ఒక పెరుగుతూ పజిల్‌లా మారిన సమస్యకు పరిష్కారం చూపాను. దాదాపు పదివేల కోట్ల భారాన్ని భరించాం’ అని మోదీ అన్నారు. ఏ ప్రభుత్వానికైనా ఇంత పెద్ద మొత్తాన్ని కేటాయించటం చాలా కష్టమైన పనే అని ఆయన అన్నారు. మొదటి విడతగా రూ.5500 కోట్లను విడుదల చేశామని మోదీ పేర్కొన్నారు. హిమాచల్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌పైనా ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బిజెపి ముఖ్యమంత్రులు ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు, రోడ్ల నిర్మాణంకోసం అంకిత భావంతో పనిచేస్తే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాత్రం తన సొంత సంక్షేమం గురించి పని చేశారని ఎద్దేవా చేశారు.

చిత్రం.. మంగళవారం హిమాచల్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి
జ్ఞాపికను అందిస్తున్న ముఖ్యమంత్రి వీరభద్రసింగ్