జాతీయ వార్తలు

నిర్లక్ష్యమే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, అక్టోబర్ 18: భద్రత, నిర్వహణ పరంగా నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్లే ఇక్కడి ఎస్‌యుఎమ్ ఆసుపత్రిలో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగి 22 మంది మరణానికి దారితీసిందంటూ ఒడిశా ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసింది. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆసుపత్రి సూపరింటెండెంట్ సహా మొత్తం నలుగురు అధికారుల్ని అరెస్టు చేశారు. మరో నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. మంటల్లో గాయపడ్డ వంద మంది రోగుల్ని తదుపరి చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదాలకు సంబంధించి కారణాలపై దర్యాప్తు మొదలైంది. సోమవారం రాత్రి 22 మంది ప్రాణాలను బలిగొన్న అగ్నిప్రమాదానికి సంబంధించి ఆస్పత్రి సిబ్బంది నలుగురిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. అగ్నిప్రమాదం సంభవించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్, డయాలసిస్ విభాగాలకు చెందిన 100 మందికిపైగా రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి అగ్నిప్రమాదం తర్వాత ‘సమ్’ ఆస్పత్రినుంచి మార్చిన 106 మంది రోజులు నగరంలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఒడిశా రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి ఆర్తి ఆహుజా చెప్పారు. నగరంలోని క్యాపిటల్ ఆస్పత్రికి 14 మృతదేహాలు, ఎఎంఆర్‌ఐ ఆస్పత్రికి 5 మృతదేహాలు వచ్చాయని ఆమె చెప్పగా, తమ ఆస్పత్రిలో మరొకరు చనిపోయినట్లు భువనేశ్వర్ ఎయిమ్స్ ఆస్పత్రి ప్రతినిధి ఒకరు చెప్పారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఊపిరాడకపోవడం, పొగ కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఐసియులో ఉండిన రోగుల్లో ఎక్కువ మంది వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారని కూడా ఆయన చెప్పారు.
ఈ సంఘటనకు సంబంధించి నలుగురు ఆస్పత్రి సిబ్బందిని సస్పెండ్ చేసిన ఆస్పత్రిని నిర్వహిస్తున్న ‘శిక్షా ఓ అనుసంధాన్ యూనివర్శిటీ’ (ఎస్‌ఓయు) మృతుల కుటుంబాలకు తలా 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. సస్పెండయిన వారిలో ఒక ఫైరాఫీసర్, ఇద్దరు ఇంజనీర్లు, ఒక హాస్పిటల్ మేనేజర్ ఉన్నట్లు ఎస్‌ఓయు వైస్ చాన్సలర్ అమిత్ బెనర్జీ విలేఖరులకు చెప్పారు. అంతేకాదు ఆస్పత్రి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేవని ఆయన స్పష్టం చేశారు. దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఐసియు, డయాలసిస్ యూనిట్లను సీల్ చేసినట్లు ఆయన చెప్పారు. ఆస్పత్రి మొదటి అంతస్థులో ఉన్న డయాలసిస్ విభాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్న విషయం తెలిసిందే. మంటలు వెంటనే అదే అంతస్థులో ఉన్న ఐసియుకు వ్యాపించాయి.
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం రోగులు చికిత్స పొందుతున్న నగరంలోని ఎయిమ్స్, ఎఎంఆర్‌ఐ ఆస్పత్రులను సందర్శించి రోగుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇతర ఆస్పత్రులకు తరలించిన రోగులకు సరయిన చికిత్స అందేలా చూడడం ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అతను సబ్యసాచి నాయక్ చెప్పారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్య, శిక్షణ విభాగం డైరెక్టర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. రెవిన్యూ డివిజనల్ కమిషనర్ చేత దర్యాప్తుకు కూడా ఆదేశించినట్లు తెలిసింది.

చిత్రం.. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్