జాతీయ వార్తలు

బారాముల్లాలో ఉగ్రవాద డెన్ ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 18:ఉగ్రవాదులపై ఉక్కుపాదం మొపుతున్న సైనిక దళాలు మంగళవారం మరో విజయం సాధించాయి. బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదుల రహస్య కేంద్రాలను మట్టుబెట్టాయి. ఆ ప్రాంతంలో బాంబులతో పాటు చైనా, పాకిస్తాన్ జెండాలు, లష్కరే తోయిబా,జైషే మొహమ్మద్ వంటి తీవ్రవాద సంస్థలకు చెందిన లెటర్‌హెడ్‌లను స్వాధీనం చేసుకున్నాయి.
కాశ్మీర్‌లో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందన్న ఆరోపణలకు ఈ సాక్ష్యాలు మరింత బలాన్నిస్తున్నాయి. గత వంద రోజులుగా కాశ్మీర్ లోయలో అంతూపొంతూ లేని రీతిలో హింసా, విధ్వంస కాండలు జరుగుతున్నాయి. జూలై 8న హిజ్‌బుల్ ముజాహిద్దీన్ మిలిటెంట్ బూర్హన్ వనీని సైనికులు హతమార్చినప్పటి నుంచీ కాశ్మీర్‌లోయలో హింసాకాండ చెలరేగుతూనే ఉంది. ఈ అల్లర్లలో
ఇప్పటి వరకూ 84మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు.
దాడులను తిప్పికొడతాం:సైన్యం
పాకిస్తాన్ దళాలు, ఉగ్రవాదులు సీమాంతర దాడులకు ఒడిగడితే గట్టిగా బుద్ధి చెబుతామని సైనిక దళాలు మంగళవారం స్పష్టం చేశాయి. ఆధీన రేఖ పొడవునా రెప్పవాల్చని నిఘా కొనసాగిస్తున్నామని, ఎలాంటి దుశ్చర్యమైనా తిప్పికొట్టేందుకు సన్నద్ధంగా ఉన్నామని లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా తెలిపారు.