జాతీయ వార్తలు

శివకాశిలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివకాశి, అక్టోబర్ 20: బాణసంచా తయారీకి కేంద్రమైన తమిళనాడులోని శివకాశిలో గురువారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. పది మంది గాయపడ్డారు. లారీలోంచి బాణసంచా సామగ్రిని దుకాణం వద్ద దించుతుండగా నిప్పు అంటుకుంది. క్షణాల్లో మంటలు వ్యాపించి ఎనిమిది మంది మృతి చెందారు. పది మంది వరకూ గాయపడ్డారు. సమీపంలోని పలు వాహనాలు అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు. వాహనం నుంచి బాణసంచా సామగ్రి దిగుమతి చేస్తుండగా జరిగిన పొరపాటే ప్రమాదానికి కారణమైందని అధికారులు వెల్లడించారు. గాయపడ్డవారిలో పరువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇది చుట్టుపక్కలకు వ్యాపించి ఉంటే మరింత ప్రాణనష్టం జరిగి ఉండేదని కలెక్టర్ ఎ శివగ్నానం అన్నారు. మరోపక్క అగ్నిప్రమాదంపై విచారణ జరిపించాలని పిఎంకె అధినేత ఎ రాందాస్ డిమాండ్ చేశారు. సమీపంలోనే పాథాలజీ లెబొరేటరీ ఉండగా బాణసంచా అవుట్‌లెట్‌కు అనుమతి ఎలా ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పిఎంకె నేత విజ్ఞప్తి చేశారు. దీపావళి సీజన్‌లో శివకాశిలో అగ్నిప్రమాదాలు జరగడం మామూలైపోయింది. ఇక్కడ వేలకొద్ది బాణసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి.

చిత్రం..తమిళనాడులోని శివకాశిలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో వ్యాపించిన మంటలు