జాతీయ వార్తలు

దోషులను వదలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, అక్టోబర్ 20: ఎస్‌యుఎంలో 21 మంది మరణానికి బాధ్యులైన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదలిపెట్టేది లేదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని గురువారం ఇక్కడ పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైనవారెవరినీ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి యజమానితోపాటు ఐదుగుర్ని అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. ఎస్‌యుఎం ఆసుపత్రి యజమాని మనోజ్‌నాయక్ ఒడిశా పోలీసుల ఎదుట లొంగిపోయిన కొద్ది సేపటికే ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం. నాయక్, ఆయన భార్య సాస్‌వతి దాస్‌లపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. దంపతులిద్దరూ శిక్షా అనుసధన్ చారిటబుల్ ట్రస్ట్‌కు ట్రస్టీలుగా ఉన్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించి ఆసుపత్రి యాజమాన్యంపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘన, అగ్ని ప్రమాదాలు నివారణ చర్యలు తీసుకోకపోవడంవల్లే ఈ ఘటన చోటుచేసుకుందని నిర్ధారించారు. మెడికల్ సూపరింటిండెంట్ పుష్పరాజ్ సమంతసింఘార్, మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అమూల్య కుమార్ సాహు, ఫైర్ సేఫ్టీ అధికారి సంతోశ్ దాస్, రిటైర్డ్ జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) మలై కుమార్ సాహులను మంగళవారం పోలీసుల అరెస్టు చేశారు.