జాతీయ వార్తలు

లోపాలు నిజమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, అక్టోబర్ 20: గత సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగి 21 మంది ప్రాణాలు కోల్పోయిన భువనేశ్వర్‌లోని ‘సమ్’ ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన లోపాలున్నట్లు ఒడిశా ప్రభుత్వం తొలిసారిగా గురువారం అంగీకరించింది. సమ్ ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన లోటుపాట్లున్నాయని, బాధ్యులపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అతను ఎస్ నాయక్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. సమ్ ఆస్పత్రిలో సేఫ్టీ చర్యలకు సంబంధించి లోపాలున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా బుధవారం చెప్పిన ఒక రోజు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీ విషయంలో లోపాలున్నట్లు అంగీకరిస్తూ ప్రకటన చేయడం గమనార్హం.
ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి సమ్ ఆస్పత్రి యజమాని మనోజ్ నాయక్ ఒడిశా పోలీసులకు లొంగిపోయారు. మనోజ్ నాయక్ తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో ఖందగిరి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయినట్లు నగర పోలీసు కమిషనర్ వైబి ఖురానియా విలేఖరులకు చెప్పారు. అనంతరం ఆయనను ప్రశ్నించడం కోసం పోలీసులు ఆజ్ఞాత ప్రదేశానికి తీసుకెళ్లారు. నాయక్, ఆయన భార్య సాస్వతి దాస్‌లు ఆస్పత్రిని నడుపుతున్న చారిటీ సంస్థలో ట్రస్టీలుగా ఉన్నారు. మరోవైపు నాయక్ చైర్మన్‌గా ఉన్న చారిటబుల్ ట్రస్టు ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు జరపాలని నల్లధనంపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది.
అగ్నిప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాయక్ హామీ ఇస్తూ, భవిష్యత్తులో రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలోను ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒడిశా క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్(నియంత్రణ, క్రమబద్ధీకరణ) సవరణ చట్టం, 2016ను ఆమోదించడం జరిగిందని, ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 5 లక్షల రూపాయల జరిమానా, ఆరు నెలల జైలుశిక్ష విధించడానికి వీలుగా నిబంధనలు సైతం ఉన్నాయని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, ఆరోగ్య మంత్రి తక్షణం రాజీనామా చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపి ప్రదీప్ మఝి చెప్పారు. కాగా, ‘రాష్ట్ర మంత్రి తన విధులను సక్రమంగా నిర్వర్తించనప్పుడు ముఖ్యమంత్రి జవాబుదారీ అవుతారు. మంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరు కూడా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడమో లేదా పదవులనుంచి తప్పుకోవడమో చేయాలి’ అని ఒడిశా బిజెపి ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ హరిచందన్ అన్నారు.