జాతీయ వార్తలు

‘్భరత్ మాతా కీ జై’ అననివారి తలలు నరికేసేవాణ్ణి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోహ్‌తక్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: యోగా గురువు రామ్‌దేవ్ బాబా సోమవారం ఇక్కడ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘్భరత్ మాతాకీ జై’ అనకపోతే లక్షలాది మంది తలలు నరికి చంపేసేవాడినని ఆయన అన్నారు. అయితే భారత రాజ్యాంగలో ‘్భరత్ మాతాకీ జై’ అనాలని ఎక్కడా లేదు కాబట్టి దానిపై గౌరవంతో తాను ఆ పనిచేయడం లేదని రామ్‌దేవ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాతృదేశాన్ని గౌరవించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. భారత్ మాతాకీ జై కొట్టనని కొందరు వ్యాఖ్యానించడం సిగ్గుచేటని విమర్శించారు. కాగా యోగా గురువుగా చెప్పుకునే రామ్‌దేవ్ బాబా హింసను ప్రేరేపించేలా మాట్లాడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయం దారుణమని కాంగ్రెస్ విరుచుకుపడింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ ఝా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ రామ్‌దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించడానికి రామ్‌దేవ్ ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి ఆరోపించారు. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల మహారాష్ట్ర పర్యటనలో తనమెడపై కత్తిపెట్టినా భారత్ మాతాకీ జై అని చెప్పనన్న వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి. ఒవైసీ ప్రకటనను పలు రాజకీయ పక్షాలు, సంస్థలు తప్పుపట్టాయి. ఈ నేపథ్యంలోనే రామ్‌దేవ్ బాబా మాట్లాడుతూ ‘్భరత్ మాతాకీ జై అని చెప్పని వాళ్ల తలలు తీసేసేవాడిని’ అన్నారు. భారత రాజ్యాంగంలో భారత్ మాతాకీ జై చెప్పాలని ఎక్కడా లేదని, కాబట్టే తాను ఆ పని చేయడం లేదని వివరణ ఇచ్చారు. రాజ్యాంగం అంటే తనకు అపారమైన గౌరవం ఉందికాబట్టే తాను ఆ పనికి పూనుకోవడం లేదని రామ్‌దేవ్ స్పష్టం చేశారు. కన్నతల్లి వంటి మాతృదేశాన్ని అందరూ గౌరవించాల్సిందేనని ఆయన హితవుపలికారు. మాతృదేశాన్ని గౌరవించనని చెప్పడమంటే జాతి వ్యతిరేకం కిందకే వస్తుందని ఆయన అన్నారు. ‘్భరత్ మాతాకీ జై’ అనే నినాదం ఏ మతానికీ సంబంధించింది కాది, అలా అనడం జాతి గౌరవాన్ని, ప్రతిష్టను పెంచడమే అవుతుందని బాబా అన్నారు. హిందూ, సిక్కు, ముస్లిం, క్రైస్తవులు ఎవరైనా ముందు భారతీయుడే అని రోహ్‌తక్‌లో జరిగిన సద్భావనా సమ్మేళన్‌లో మాట్లాడుతూ ఆయన చెప్పారు. కాగా హిందుత్వ నినాదాలు ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ కొందరికి లైసెన్సు ఇచ్చినట్టుగా ఉందని సిపిఎం నేత బృందాకారత్ విమర్శించారు. రామ్‌దేవ్ వ్యాఖ్యను జెడియు నేత పవన్‌వర్మ తప్పుపట్టారు.