జాతీయ వార్తలు

దూసుకుపోతున్న వైమానికరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, అక్టోబర్ 22: విమానయాన రంగంపై గత ప్రభుత్వాలకు ఎలాంటి విజన్ లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శిస్తూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ రంగానికి సంబంధించి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించిందని, అభివృద్ధిని, ఉపాధి అవకాశాలను పెంచే ఈ రంగం విస్తరణకు ఉద్యమ స్ఫూర్తితో పని చేస్తోందని చెప్పారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌ను ప్రధాని మోదీ శనివారం జాతికి అంకితం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సమీప భవిష్యత్తులోనే భారత దేశం ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ విషయంలో ప్రపంచంలోనే మూడో దేశం కానుందని చెప్పారు. దేశానికి 80-100 విమానాశ్రయాలు చాలని అనుకుంటే దేశ అభివృద్ధికి అడ్డంకులను సృష్టించడమేనని ఆయన అన్నారు. టూటైర్, త్రీటైర్ పట్టణాలపైన కూడా దృష్టిపెట్టినట్లయితే దేశ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని అన్నారు.
ఇంతకుముందు ప్రభుత్వాలకు రాబోయే అయిదు, పదేళ్లలో ఈ రంగాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ప్రయాణికుల అవసరాలు ఎలా తీర్చాలి, సామాన్య ప్రజలకు ఏం చేయాలి అనే విజన్ ఉండేది కాదని, అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలోనే తొలిసారిగా ఈ రంగానికి సంబంధించి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఇప్పుడు దేశంలో విమానయాన రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, రాబోయే అయిదేళ్లలో భారత దేశంలోని విమానాశ్రయాలు ఏటా అమెరికా జనాభాతో సమానంగా ప్రయాణికులను తరలించే స్థితికి చేరుకుంటాయని అంచనా అని చెప్పారు. పర్యాటక రంగ అభివృద్ధిలో వైమానిక రంగం ఎంతో ముఖ్యమైందని, పర్యాటక రంగం అభివృద్ధి చెందడంవల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయన్నారు. పర్యావరణ హిత ఉద్యమంలో వడోదర, కోచ్చి విమానాశ్రయాలు పాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు.
దాదాపు 17,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ గంటకు 700 మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే విధంగా రూపొందించారు. 160 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. 2009లో అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ ఈ టెర్మినల్‌కు శంకుస్థాపన చేయగా, ఏడేళ్లలో నిర్మాణం పూర్తి చేశారు.
అంతకు ముందు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి విమాన ప్రయాణికుల ట్రాఫిక్ ఇరవై శాతానికి పైగా పెరుగుతోందని చెప్పారు. అనంతరం నగరంలో సామాజిక అధికారితా శిబిర్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లను ప్రధాని మోదీ అందజేశారు.

చిత్రం.. వడోదర ఎయర్ పోర్టులో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ