జాతీయ వార్తలు

నల్లధనంపైనా లక్షిత దాడులు చేస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, అక్టోబర్ 22: నల్లధనానికి వ్యతిరేకంగా లక్షిత దాడులు నిర్వహించి ఉంటే ఎలా ఉండేదోనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం అన్నారు. ‘‘దేశవ్యాప్తంగా నల్లధనాన్ని వెల్లడి చేసేందుకు ఒక్క అవకాశం ఇచ్చాం. ఆ ఒక్క అవకాశంతోనే రూ.65వేల కోట్లు పన్ను రూపంలో, జరిమానా రూపంలో వచ్చాయి. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా 36వేల కోట్ల రూపాయలు దారి మళ్లకుండా కాపాడగలిగాం. ఈ రెంటినీ కలిపితే సుమారు లక్ష కోట్ల రూపాయలు ఎలాంటి లక్షిత దాడులు జరపకుండానే వచ్చాయి.’’ అని మోదీ పిఓకేలో ఆర్మీ లక్షిత దాడులతో నల్లధనం వ్యవహారాన్ని పోల్చారు. ‘‘ఈ రంగంలో మనం లక్షిత దాడులు నిర్వహించి ఉంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకొండి’’అని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువా అవినీతికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం లేకుండానే యుద్ధం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. దళారులతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఆర్థిక సహకారం ఇప్పుడు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వడోదరాలో జరిగిన సామాజిక అధికారితా శిబిరంలో దివ్యాంగులకు 8వేల మూడు చక్రాల బండ్లు పంపిణీ చేశారు.