జాతీయ వార్తలు

పాక్ నటులను తీసుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 22: రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాల ఒత్తిళ్లకు బాలీవుడ్ నిర్మాతల మండలి దిగొచ్చింది. ఉరీ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ కళాకారులను నిషేధించాలని దేశ వ్యాప్తంగా డిమాండ్ చేశారు. పాకిస్తాన్ నటులతో సినిమాలు తీయబోమని బాలీవుడ్ నిర్మాతల గిల్డ్ ప్రకటించింది. కాగా కరణ్ జోహార్ నిర్మించిన ‘యే దిల్ హై ముష్కిల్’ చిత్రం విడుదలకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్రం విడుదలను చేయనీబోమని రాజ్‌థాకరే నాయకత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ప్రకటించింది. అనేక ప్రజా సంఘాలు కరణ్ సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించాయి. దీంతో కరణ్ జోహార్‌తో పాటు బాలీవుడ్ నిర్మాతల గిల్డ్ అధ్యక్షుడు ముకేష్ భట్ శనివారం ఇక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవిస్‌ను కలిశారు. ఫడ్నవిస్ అధికార నివాసం‘వర్ష’లో ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ థాకరేతో సమావేశమై యే దిల్ హై ముష్కిల్ విడుదలకు మార్గం సుగమం చేసుకున్నారు. పాకిస్తాన్ నటుడు ఫరాద్ ఖాన్ నటించిన కరణ్ చిత్రం విడుదల చేస్తే థియేటర్లపై దాడులు చేస్తామని రాజ్ పార్టీ ఇంతకు ముందు హెచ్చరించింది. ఇక నుంచి పాకిస్తాన్ నటులతో సినిమాలు నిర్మించబోమని గిల్డ్ హామీ ఇచ్చింది. అంతేకాకుండా చిత్రం ప్రదర్శనకు ముందు అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తామని నిర్మాత కరణ్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర సిఎం నివాసంలో జరిగిన సమావేశానికి బాలీవుడ్ నిర్మాతలు సిద్దార్థ్ రాయ్ కపూర్, సాజిద్ నాడియావాల, ఫాక్స్ స్టార్ స్టూడియోకు చెందిన విజయ్ సింగ్ హాజరయ్యారు. సమావేశానంతరం గిల్డ్ అధ్యక్షుడు ముకేష్ భట్ విలేఖరులతో మాట్లాడుతూ ‘యే దిల్ హై ముష్కిల్’ విడుదలకు అవరోధాలు తొలగిపోయాయని వెల్లడించారు. సిఎంతో సమావేశం సానుకూలంగా జరిగిందని ఆయన ప్రకటించారు. చిత్రం విడుదలపై తలెత్తిన సమస్యలను సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. భవిష్యత్‌లో పాకిస్తాన్ కళాకారులు, సాంకేతిక నిపుణులను తీసుకోబోమని నిర్మాతల అందరి తరఫున హామీ ఇచ్చినట్టు భట్ పేర్కొన్నారు. అంతేకాదు నిర్మాతల మండలి సమావేశమై దీనిపై ఓ తీర్మానం చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఆ కాపీని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు అందజేయనున్నట్టు ఆయన చెప్పారు. సైనిక సంక్షేమం కోసం ఐదు కోట్ల రూపాయలు అందజేస్తామని చిత్ర నిర్మాత కరణ్ జోహర్ తెలిపారు.
నిషేధం సబబే: సుబ్రహ్మణ్యస్వామి
న్యూయార్క్: భారతీయ చిత్రాల్లో పాకిస్తాన్ కళాకారులను నిషేధించాలన్న డిమాండ్‌కు బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి మద్దతు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, దాడులకు వత్తాసు పలుకుతున్న పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పాల్సిందేనని ఆయన అన్నారు. పాక్ చర్యల మూలంగా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని ఆయన తెలిపారు. పాకిస్తాన్‌కు సరైన బుద్ధి రావాలాంటే అక్కడి నటులు, కళాకారులు, చివరికి క్రికెటర్లను కూడా భారత్‌లోకి అనుమతించకూడదని న్యూయార్క్ వర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వామి పేర్కొన్నారు.
ఆర్మీ పరువు తీస్తున్నారు:
న్యూఢిల్లీ: హిందీ సినిమాలపై మహారాష్ట్ర నవనిర్మాణసేన చేసిన రాజకీయంపై సీనియర్ సైనిక అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాక్ సినిమా నటులు నటించిన ఏ దిల్‌హై ముష్కిల్ సినిమా నిర్మాతలు సైనిక సంక్షేమ నిధికి అయిదు కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ ఎం ఎన్ ఎస్ ఒత్తిడి తేవటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘సైనిక సంక్షేమ నిధికి పౌరులు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తేనే తీసుకుంటాం కానీ, బలవంతం చేసి ఇప్పించినట్లయితే అంగీకరించేది లేద’’ని స్పష్టం చేశారు. సైన్యానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, రాజకీయాల్లోకి సైన్యాన్ని లాగటం సరైన పని కాదని వారన్నారు.